బ్యాట్ పై స్టిక్కర్లను మార్చుతున్న ధోనీ.. ఎందుకంటే..?

ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇటు కెరీర్‌ను, అటు ఫ్యామిలీని చక్కగా డీల్ చేస్తాడు ధోనీ. కాగా.. సాధారణంగా క్రికెట్ బ్యాట్స్‌మెన్ బ్యాట్స్, టీషర్ట్స్‌పై చాలా రకాల బ్రాండ్ లోగోలు కనిపిస్తాయి. వాటిని స్పాన్సర్‌ చేస్తూ క్రికెటర్స్ వాటి స్టిక్కర్స్‌ను పెట్టుకుంటారు. దానికి ఆ బ్రాండ్ సంస్థలు క్రికెటర్స్‌కి ఎంతో కొంత ముట్టజెప్పుతాయి. అయితే.. ధోని తన బ్యాట్‌పై ఎక్కువగా స్టిక్సర్స్ మార్చుతూంటాడు. దీంతో.. ధోని […]

బ్యాట్ పై స్టిక్కర్లను మార్చుతున్న ధోనీ.. ఎందుకంటే..?
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 10:20 AM

ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇటు కెరీర్‌ను, అటు ఫ్యామిలీని చక్కగా డీల్ చేస్తాడు ధోనీ. కాగా.. సాధారణంగా క్రికెట్ బ్యాట్స్‌మెన్ బ్యాట్స్, టీషర్ట్స్‌పై చాలా రకాల బ్రాండ్ లోగోలు కనిపిస్తాయి. వాటిని స్పాన్సర్‌ చేస్తూ క్రికెటర్స్ వాటి స్టిక్కర్స్‌ను పెట్టుకుంటారు. దానికి ఆ బ్రాండ్ సంస్థలు క్రికెటర్స్‌కి ఎంతో కొంత ముట్టజెప్పుతాయి. అయితే.. ధోని తన బ్యాట్‌పై ఎక్కువగా స్టిక్సర్స్ మార్చుతూంటాడు. దీంతో.. ధోని ఎక్కువగా డబ్బులు సంపాదించేస్తున్నాడని చెబుతూంటారు.

ఈ విషయంకు సంబంధించి ధోని మేనేజర్‌ అరుణ్‌పాండేను అడగగా.. ఆయన ఇలా సమాధానమిచ్చాడు. ‘మీరు అనుకున్నట్లు ధోని బ్యాట్స్‌పై బ్రాండ్ స్టిక్కర్స్ మారుస్తారు. అది కూడా ఓ బిజినెస్‌నే. కానీ.. ధోనీ మాత్రం ఆ కంపెనీల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. తన కెరీర్‌లో సందర్భానుసారంగా ఆయా కంపెనీలు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపారు. అంతేగాక ధోనికి మంచి మనసుందని, ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తారని చెప్పారు అరుణ్ పాండే.