టీమిండియా క్రికెటర్ బుగ్గ గిల్లి పారిపోయిన క్యూట్ గర్ల్…

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచమంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్‌తో పాటు క్రికెట్ టోర్నీలు కూడా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. మన టీమిండియా క్రికెటర్లలో కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటే, మరికొందరు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీ అయిపోయారు. తాజాగా భారత స్టార్ బౌలర్​ యుజువేంద్ర చాహల్​ మాత్రం తనలోని యాక్టింగ్‌ని బయటకు చూపించాడు. సోషల్ మీడియాలో ఓ టిక్‌టాక్ వీడియోతో సందడి చేశాడు. దానికి ఇప్పుడు ఊహించని స్పందన వస్తోంది. […]

  • Updated On - 7:16 pm, Thu, 19 March 20 Edited By: Pardhasaradhi Peri
టీమిండియా క్రికెటర్ బుగ్గ గిల్లి పారిపోయిన క్యూట్ గర్ల్...

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచమంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్‌తో పాటు క్రికెట్ టోర్నీలు కూడా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. మన టీమిండియా క్రికెటర్లలో కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటే, మరికొందరు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీ అయిపోయారు. తాజాగా భారత స్టార్ బౌలర్​ యుజువేంద్ర చాహల్​ మాత్రం తనలోని యాక్టింగ్‌ని బయటకు చూపించాడు. సోషల్ మీడియాలో ఓ టిక్‌టాక్ వీడియోతో సందడి చేశాడు. దానికి ఇప్పుడు ఊహించని స్పందన వస్తోంది.

ఈ వీడియోలో చాహల్ ఓ అమ్మాయితో కలిసి నడిచుకుంటూ వెళ్తూ..మధ్యలో షూ లేస్ కట్టుకునేందుకు వంగుతాడు. అప్పుడే పక్కన ఉన్న అమ్మాయి చాహల్‌ని వెనక్కి వెళ్లి ఆటపట్టిస్తుంది. ఆమెను పట్టుకునేందుకు చాహల్ ట్రై చెయ్యగా…బుగ్గ గిల్లి అక్కడినుంచి పారిపోతుంది. ఈ వీడియోలోని అమ్మాయి కూడా క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. మరో వీడియోలో తనలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్‌ని కూడా ప్రదర్శించాడు ఈ క్రికెటర్.

కాగా చాహల్ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటాడు. అతనికో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. పలువురు సహచర క్రికెటర్లను సైతం అతడు ఇంటర్వూ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు చాహల్.