విరాట్‌ మళ్లీ శతక్కొట్టాడు

నాగ్‌పూర్: వరల్డ్ నంబర్ 1 వన్డే బాట్స్‌మన్, టీం ఇండియా సారథి విరాట్ కోొహ్లి మరోసారి సెంచరీ బాదాడు. గ్రౌండ్ ఏదైనా బౌలర్స్ బెండ్ తీస్తున్న మన పరుగుల మెషీన్ టీం ఇండియా అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చాడు. తాజాగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకం బాదేశాడు. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లి వన్డే క్రికెట్‌లో 40వ శతకాన్ని నమోదు చేశాడు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:54 pm, Tue, 5 March 19
విరాట్‌ మళ్లీ శతక్కొట్టాడు

నాగ్‌పూర్: వరల్డ్ నంబర్ 1 వన్డే బాట్స్‌మన్, టీం ఇండియా సారథి విరాట్ కోొహ్లి మరోసారి సెంచరీ బాదాడు. గ్రౌండ్ ఏదైనా బౌలర్స్ బెండ్ తీస్తున్న మన పరుగుల మెషీన్ టీం ఇండియా అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చాడు. తాజాగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకం బాదేశాడు. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లి వన్డే క్రికెట్‌లో 40వ శతకాన్ని నమోదు చేశాడు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. అయితే రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆపై ధావన్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.

వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్‌(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడుతో కలిసి కోహ్లి మరో 37 పరుగులు జత చేశాడు. కాగా, రాయుడు(18) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తరుణంలో కోహ్లి-విజయ్‌ శంకర్‌ జంట ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా, విజయ్‌ శంకర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత కేదార్‌ జాదవ్‌(11), ఎంఎస్‌ ధోని(0)  వెనువెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. కాగా, ఆ సమయంలో కోహ్లితో జత కలిసిన రవీంద్ర జడేజా కదురుగా బ్యాటింగ్‌ చేశాడు. మరొకవైపు కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ సెంచరీ మార్కును చేరాడు.