100 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ కన్నుమూత..!

భారత కురవృద్ధుడైన మాజీ రంజీ క్రికెటర్ వసంత్ రైజీ(100) కన్నుమూశారు. ముంబయిలోని వాల్కేశ్వర్‌లోని తన సొంతింటిలో.. శనివారం తెల్లవారుజామున గం.2.20ని.ల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు

100 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ కన్నుమూత..!
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 12:22 PM

భారత కురవృద్ధుడైన మాజీ రంజీ క్రికెటర్ వసంత్ రైజీ(100) కన్నుమూశారు. ముంబయిలోని వాల్కేశ్వర్‌లోని తన సొంతింటిలో.. శనివారం తెల్లవారుజామున గం.2.20ని.ల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు వసంత్ అల్లుడు సుదర్శన్ నానావతి మీడియాకు తెలిపారు. కుడి చేతి ఆటగాడైన రైజీ 1940లో 9 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు చేశారు. ముంబయి టీమ్‌లోకి 1941లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ టీమ్‌ తరఫున పలు రంజీ ఆటలను ఆడారు. 13 ఏళ్ల వయస్సులోనే ముంబయి జింఖానా గ్రౌండ్‌లో భారత్‌ తరఫున వసంత్ తొలి టెస్ట్ ఆడటం విశేషం. అంతేకాదు క్రికెట్ గురించి ఆయన 9 పుస్తకాలను కూడా రాశారు. అలాగే చార్టర్ అకౌంటెంట్‌గా కూడా ఆయన పనిచేశారు. ఇక ఈ ఏడాది జనవరిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, ఆస్ట్రేలియన్ మాజీ స్కిప్పర్ స్టీవ్ వాగ్.. వసంత్ ఇంటికి వెళ్లి ఆయన పుట్టినరోజును జరిపారు. వసంత అంత్యక్రియలు ఇవాళ నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్: దేశంలో 3 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!