Anita Alvarez: స్విమ్మింగ్‌ పూల్‌లో స్పృహ కోల్పోయి.. మృత్యువు అంచుల దాకా వెళ్లి.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోస్‌..

Viral News: క్రీడా పోటీల్లో ఒక్కోసారి ఊహించని సంఘటనలు, విషాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారైతే ప్రాణాలు కూడా గాల్లో కలిసి పోతుంటాయి. ఈక్రమంలో అమెరికాకు చెందిన మేటి స్విమ్మర్‌ అనితా అల్వరేజ్ (Anita Alvarez)కు

Anita Alvarez: స్విమ్మింగ్‌ పూల్‌లో స్పృహ కోల్పోయి.. మృత్యువు అంచుల దాకా వెళ్లి.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోస్‌..
Anita Alvarez
Follow us

|

Updated on: Jun 23, 2022 | 3:29 PM

Viral News: క్రీడా పోటీల్లో ఒక్కోసారి ఊహించని సంఘటనలు, విషాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారైతే ప్రాణాలు కూడా గాల్లో కలిసి పోతుంటాయి. ఈక్రమంలో అమెరికాకు చెందిన మేటి స్విమ్మర్‌ అనితా అల్వరేజ్ (Anita Alvarez)కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈత పోటీల్లో పాల్గొన్న ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగగానే సొమ్మసిల్లిపడిపోయింది. నీటి అడుగుభాగంలోకి వెళ్లిపోయి అచేతనంగా, ఓ శవంలా తేలియాడుతూ కనిపించింది. పరిస్థితిని గమనించిన కోచ్‌ వెంటనే నీటి కొలనులోకి దూకింది. స్విమ్మర్‌ను వెంటనే బయటకు తీసుకొచ్చింది. సహచరులు, సిబ్బంది వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, ప్రస్తుతం తన పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని, ఊపిరి తీసుకుంటుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

25 ఏళ్ల స్విమ్మర్‌ అనిత ఈత కొలనులోకి దిగిన తర్వాత క్రమంగా శ్వాస తీసుకోలేక‌పోయింది. సోలో ఫ్రీ ఈవెంట్‌లో త‌న రొటీన్ పూర్తి చేసిన త‌ర్వాత సొమ్మసిల్లీర ఆమె పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోవడంతో నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకింది. అల్వరేజ్‌ను ర‌క్షించి బయటకు తీసుకొచ్చింది. కాగా ఈ ఘటనపై అమెరికా స్విమ్మింగ్‌ టీం ఒక ప్రకటన విడుదల చేసింది. అనితా ఇలా స్విమ్మింగ్‌ కొలనులో స్పృహ కోల్పోవడం ఇదేమి మొదటి సారి కాదు. గ‌త ఏడాది బార్సిలోనాలో జ‌రిగిన ఒలింపిక్ క్వాలిఫ‌యింగ్ ఈవెంట్‌లోనూ అనితా సొమ్మసిల్లి స్పృహ కోల్పోయింది. తదుపరి వైద్య పరీక్షల అనంతరం అనిత పాల్గొనే ఈవెంట్స్‌ గురించి అధికారికంగా తెలియజేస్తాం’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..