Tokyo Olympics: బంగారు పతకం సాధిస్తే.. ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్లు.. అధికారికంగా ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే అందులోని పంజాజ్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున భారీ నజరానా అందజేస్తామని..

Tokyo Olympics: బంగారు పతకం సాధిస్తే.. ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్లు.. అధికారికంగా ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
Tokyo Olympics
Subhash Goud

| Edited By: Phani CH

Jul 31, 2021 | 8:01 AM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే అందులోని పంజాజ్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున భారీ నజరానా అందజేస్తామని ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి శుక్రవారం వెల్లడించారు. ముందు జట్టు మొత్తానికి రూ.2.25 కోట్లు అని ప్రకటించగా, తర్వాత అది పంజాబ్‌ ఆటగాళ్లలో ఒక్కొక్కరికి మాత్రమేనని మంత్రి అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. టోక్యోలో జరుగుతున్న విశ్వక్రీడల్లో పంజాబ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని ప్రశంసించారు.

మరో వైపు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తూ క్వార్టర్‌ఫైనల్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఫూల్‌-ఏలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మనకన్నా ముందు నిలిచి పూల్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ క్వార్టర్స్‌కు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే ఏదో ఒక పతకం సాధించడం ఖాయమని కనిపిస్తోంది. కాగా, భారత హాకీ జట్టు 1980లో చివరిసారి పతకం సాధించింది. ఇక అప్పటి నుంచి మరో పతకం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఈసారైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్ర యాత్ర.. పతకానికి మరో అడుగు దూరంలో తెలుగుతేజం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu