Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongadi Trisha: అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు రూ కోటి నజరానా..

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ గొంగడి త్రిష ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిషను సీఎం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

Gongadi Trisha: అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు రూ కోటి నజరానా..
Srikanth, Cm Revanth Reddy
Follow us
Prabhakar M

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 05, 2025 | 3:38 PM

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ గొంగడి త్రిష ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిషను సీఎం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

కోటి రూపాయల ప్రోత్సాహకం..

జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి త్రిష ప్రతిభను కొనియాడుతూ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. “నీ ప్రతిభ తెలంగాణ గర్వించదగినది. భవిష్యత్తులో భారత జట్టును మరింతగా గెలిపించాలి” అంటూ ఆమెకు ప్రోత్సాహం అందించారు. తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెటర్లు ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ధృతి కేసరికి రూ. 10 లక్షల నజరానా

అండర్-19 మహిళల వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యురాలిగా నిలిచిన మరో తెలంగాణ క్రీడాకారిణి ధృతి కేసరి ను కూడా సీఎం అభినందించారు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.

కోచ్, ట్రైనర్లకు కూడా ప్రోత్సాహం

కేవలం క్రీడాకారులకే కాకుండా, వారిని తీర్చిదిద్దిన కోచ్‌లు, ట్రైనర్లకు కూడా గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అండర్-19 మహిళల టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు చెరో 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.

మహిళా క్రీడాకారుల ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. “మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆటగాళ్లకు ఉత్తమ శిక్షణ, ప్రోత్సాహకాలు అందజేస్తుంది” అని తెలిపారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన