ఎల్లలు లేని అభిమానం..అది డివిలియర్స్‌కే సాధ్యం

ఎల్లలు లేని అభిమానం..అది డివిలియర్స్‌కే సాధ్యం

“మీరే చెప్పారు కద సార్..మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని..మా తెలుగు ప్రజలు ఎవ్వరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయేవరకు వదిలిపెట్టరు”. ఇది ఠాగూర్ సినిమాలో సీనియర్ ఆఫీసర్‌తో ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్. కాకపోతే ఈ సంభాషణలో ఇప్పుడు ఒక్క పదం ఛేంజ్ చేసుకువాలి..అది తెలుగుకు బదులుగా భారతీయులు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ అటువంటే ఎమోషన్‌నే ఇతర దేశీయుల పట్ల చూపుతున్నారు. ఒకవైపు వారికి అవసరం ఉంటే హద్దులు దాటి […]

Ram Naramaneni

|

Oct 22, 2019 | 7:57 PM

“మీరే చెప్పారు కద సార్..మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని..మా తెలుగు ప్రజలు ఎవ్వరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయేవరకు వదిలిపెట్టరు”. ఇది ఠాగూర్ సినిమాలో సీనియర్ ఆఫీసర్‌తో ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్. కాకపోతే ఈ సంభాషణలో ఇప్పుడు ఒక్క పదం ఛేంజ్ చేసుకువాలి..అది తెలుగుకు బదులుగా భారతీయులు.

ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ అటువంటే ఎమోషన్‌నే ఇతర దేశీయుల పట్ల చూపుతున్నారు. ఒకవైపు వారికి అవసరం ఉంటే హద్దులు దాటి మరి సాయం చేస్తున్నారు. మరోవైపు టాలెంట్ ఉంటే..సరిహద్దులు క్రాస్‌ చేసి మరీ ప్రేమను కురిపిస్తున్నారు.  ఆ ప్రేమనే అందుకుంటున్నాడు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ . అతడు ఐపీఎల్ ఆడినా, సౌతాఫ్రికా తరుపున బరిలోకి దిగినా ఇండియన్ ఫ్యాన్స్‌లో మాత్రం సేమ్ రియాక్షన్. సౌతాఫ్రికాలో కూడా ఏబీకి ఈ రేంజ్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ క్రేజీ ప్లేయర్ భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక అతడు కూడా అదే రేంజ్‌లో భారత్‌పై మమకారాన్ని చూపిస్తాడు.  డివిలియర్స్ పూర్తి పేరు..అబ్రహం బెంజమిన్‌ డివిలియర్స్‌. అభిమానులు మాత్రం అతడికి  ‘మిస్టర్‌ 360’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ యాంగిల్ అయినా బంతిని స్టాండ్స్‌లోకి పంపించే సత్తా ఉంది కాబట్టి. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా 2018 మే23న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన డివిలియర్స్‌.. నాలుగో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు వెళ్లాడు. నేటికీ అతడు ఆర్‌సీబీ జట్టులోనే కొనసాగుతున్నాడు.

ఇటీవలే సౌతాఫ్రికాను టెస్ట్ సిరీస్‌లో  (3-0)  వైట్ వాష్ చేసి పంపించింది టీమిండియా. ఈ నేపథ్యంలో భారతీయులు ఎంతగానే అభిమానించే ఆ దేశానికి చెందిన ఏబీ డివిలియర్స్ ఉంటే ఫ్యాన్స్ మ్యాచులను ఇంకా ఎంజాయ్ చేసేవారు. ఈ సందర్భంగా అతడిని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది టీవీ9.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu