ఆస్ట్రేలియన్ ఓపెన్‌: కొత్త ఛాంపియన్‌గా సోఫియా కెనిన్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అమెరికాకు చెందిన సోఫియా కెనిన్‌ గెల్చుకుంది. ఫైనల్‌ పోరులో 4-6, 6-2, 6-2 తేడాతో గార్బిన్‌ ముగురుజాపై విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకుంది. 21 ఏళ్ల 80 రోజుల వయసులోనే కెనిన్‌ ఈ ఘనత సాధించడం విశేషం. 2008లో రష్యాకు చెందిన మారియా షరపోవా 20 ఏళ్ల 283 రోజుల వయసులోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ను సాధించింది. ఆ లెక్కన ఈ ఘనత సాధించిన రెండో […]

ఆస్ట్రేలియన్ ఓపెన్‌: కొత్త ఛాంపియన్‌గా సోఫియా కెనిన్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అమెరికాకు చెందిన సోఫియా కెనిన్‌ గెల్చుకుంది. ఫైనల్‌ పోరులో 4-6, 6-2, 6-2 తేడాతో గార్బిన్‌ ముగురుజాపై విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకుంది. 21 ఏళ్ల 80 రోజుల వయసులోనే కెనిన్‌ ఈ ఘనత సాధించడం విశేషం. 2008లో రష్యాకు చెందిన మారియా షరపోవా 20 ఏళ్ల 283 రోజుల వయసులోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ను సాధించింది. ఆ లెక్కన ఈ ఘనత సాధించిన రెండో పిన్నవయస్కురాలిగా కెనిన్‌ నిలిచింది. తొలి గ్రాండ్‌ స్లామ్‌ సాధించిన సోఫియా కెనిన్‌  తన కల నెరవేరిందని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.

[svt-event date=”01/02/2020,7:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Click on your DTH Provider to Add TV9 Telugu