వింబుల్డన్‌లో సంచలనం..సెరెనాపై హలెప్‌ ఘనవిజయం

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌లో ఈ సారి నూతన అధ్యాయం లిఖించబడింది.  శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో  11వ సీడ్ సెరెనా విలియమ్స్‌తో ఫైనల్లో తలపడిన.. రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్‌ సిమోనా హలెప్‌ విజయం సాధించారు. హలెప్‌ 6-2, 6-2 తేడాతో  కేవలం 56 నిమిషాల్లో మ్యాచ్ ముగించి సంచలనం సృష్టించింది. ఫైనల్ ఏకపక్ష విజయం సాధించిన హలెప్‌కు ఇది రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచిన హలెప్‌..  ఇప్పుడు […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:59 pm, Sat, 13 July 19
వింబుల్డన్‌లో సంచలనం..సెరెనాపై హలెప్‌ ఘనవిజయం

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌లో ఈ సారి నూతన అధ్యాయం లిఖించబడింది.  శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో  11వ సీడ్ సెరెనా విలియమ్స్‌తో ఫైనల్లో తలపడిన.. రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్‌ సిమోనా హలెప్‌ విజయం సాధించారు. హలెప్‌ 6-2, 6-2 తేడాతో  కేవలం 56 నిమిషాల్లో మ్యాచ్ ముగించి సంచలనం సృష్టించింది. ఫైనల్ ఏకపక్ష విజయం సాధించిన హలెప్‌కు ఇది రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచిన హలెప్‌..  ఇప్పుడు తాజాగా వింబుల్డన్‌లో గెలిచి తన సత్తా చాటింది. ఇక అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన మార్గరెట్‌(24 టైటిల్స్‌) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు.