Sachin Tendulkar: గుజరాతీ రెస్టారెంట్‌లో అంజలి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సారా..

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన సతీమణి అంజలి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులందరికీ ఓ రెస్టారెంట్‌లో..

Sachin Tendulkar: గుజరాతీ రెస్టారెంట్‌లో అంజలి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సారా..
Follow us

|

Updated on: Nov 11, 2021 | 5:51 PM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన సతీమణి అంజలి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులందరికీ ఓ రెస్టారెంట్‌లో విందును ఏర్పాటుచేశాడు. ఈ సందర్భంగా గుజరాతీ ప్రత్యేకం థాలీని రుచిచుశామంటూ తన డిన్నర్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు అంజలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ షేర్‌ చేసుకున్న ఫొటోల్లో అతడి కూతురు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

గుజరాతీ స్పెషల్ థాలీని రుచిచూశాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన సతీమణి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఫొటోలు పంచుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌..’ అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీ థాకరే భోజనాలయ్‌ రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ గుజరాతీ ప్రత్యేక వంటకం ‘థాలీ’ని రుచిచూశాం. నేను కడుపునిండుగా తిన్నా అయినా.. నా జీన్స్‌ బటన్స్‌ వదులుగానే ఉన్నాయి. ఈ రెస్టారెంట్‌ 1945 నుంచి నిర్వహిస్తున్నారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను’ అని రాసుకొచ్చాడు. ఇక అంజలితో చిన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సారా’ ఆమె ఎక్కడుంటుందో అదే నా ఇళ్లు. హ్యాపీ బర్త్‌ డే మై మామ్‌.. మై లవ్‌.. మై వరల్డ్‌ ‘ అంటూ తల్లిపై ప్రేమను కురిపించింది.

Also Read:

T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై మాజీ క్రికెటర్ల ప్రశంసలు.. అద్భుతంగా ఆడారని సచిన్ కితాబు..

T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!

India vs New Zealand: టీమిండియా జెర్సీ ధరించడం మానాన్న కల.. నేటికి నెరవేరింది: ఇండోర్ ఫాస్ట్ బౌలర్