బ్రాడ్‌మన్ 71 ఏళ్ల రికార్డుకు రోహిత్ బ్రేక్!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన క్రికెటర్‌గా బ్రాడ్‌మన్ (98.22 సగటుతో) ఉండగా, తాజాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్వదేశంలో ఆడిన గత […]

బ్రాడ్‌మన్ 71 ఏళ్ల రికార్డుకు రోహిత్ బ్రేక్!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 7:43 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన క్రికెటర్‌గా బ్రాడ్‌మన్ (98.22 సగటుతో) ఉండగా, తాజాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్వదేశంలో ఆడిన గత పది టెస్టుల్లో సగటు 99.84. ఏ ఆటగాడైనా గత పది ఇన్నింగ్స్‌ల్లో సాధించిన సగటును పరిగణలోనికి తీసుకొని ఈ రికార్డును ప్రకటిస్తారు.

రోహిత్ ఈ మ్యాచ్‌లో మరో కొన్ని రికార్డులు సైతం తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హిట్‌మైర్ ఓ టెస్టు సిరీస్‌లో సాధించిన అత్యధిక సిక్సుల రికార్డును సైతం బద్దలు కొట్టాడు. హిట్‌మైర్ బంగ్లాతో జరిగిన సిరీస్‌లో 15 సిక్సులు బాదగా, రోహిత్ 16 సిక్సులతో ఈ రికార్డును తుడిచిపెట్టాడు. ఓ టెస్టు సిరీస్‌లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు బాదిన రెండో ఓపెనర్ గా రోహిత్ రికార్డు పుటాల్లోకెక్కాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ మూడు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..