వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విండీస్ ఓపెనర్స్… ఫస్ట్ వికెట్‌కు 365 పరుగుల భాగస్వామ్యం

విండీస్ క్రికెటర్లు మరోసారి తమ దమ్ము చూపించారు. బ్యాటులు ఝులిపించి ఓ వరల్డ్ రికార్డ్ దుమ్ము దులిపారు. దీంతో వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ టీంకు బూస్ట్ లభించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా మొదటి వికెట్‌కు 365 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్. బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్  ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం డబ్లిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు క్యాంప్‌బెల్, […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:22 pm, Mon, 6 May 19
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విండీస్ ఓపెనర్స్... ఫస్ట్ వికెట్‌కు 365 పరుగుల భాగస్వామ్యం

విండీస్ క్రికెటర్లు మరోసారి తమ దమ్ము చూపించారు. బ్యాటులు ఝులిపించి ఓ వరల్డ్ రికార్డ్ దుమ్ము దులిపారు. దీంతో వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ టీంకు బూస్ట్ లభించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా మొదటి వికెట్‌కు 365 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్. బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్  ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం డబ్లిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు క్యాంప్‌బెల్, షాయ్ హోప్. గత ఏడాది జింబాబ్వేపై పాకిస్తాన్ ఓపెనర్లు ఫఖర్ జమాన్- ఇమాముల్ హక్ జోడించిన 304 పరుగుల రికార్డు భాగస్వామ్యం వెనకబడిపోయింది. 47.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడి… ఇంకో 17 బంతులు ఆడి ఉంటే తొలి ఇన్నింగ్స్ అంతా బ్యాటింగ్ చేసిన మొదటి ఓపెనింగ్ జోడిగా రికార్డు కూడా క్రియేట్ చేసేది.

వన్డేల్లో ఒకేసారి 150పైన పరుగులు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా రికార్డు సొంతం చేసుకున్నారు క్యాంప్‌బెల్, షాయ్ హోప్. క్యాంప్ బెల్ 137 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 179 పరుగులు సాధిస్తే, షాయ్ హోప్ 152 బంతులాడి 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 170 పరుగులు చేశాడు. ఓపెనింగ్‌లోనే కాకుండా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా వెస్టిండీస్ పేరిటే ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో కాన్‌బెర్రాలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై క్రిస్‌గేల్- మర్లోన్ శ్యామ్యూల్స్ కలిసి రెండో వికెట్‌కు అత్యధికంగా 372 పరుగులు జోడించారు. ఇదే ఇప్పటిదాకా ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 3 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ స్కోరు సాధిస్తే… భారీ లక్ష్యచేధనలో ఐర్లాండ్ 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది.