మ‌హిళా కానిస్టేబుల్‌తో క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వాగ్వాదం!

మ‌హిళా కానిస్టేబుల్‌తో క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వాగ్వాదం!

భార‌త క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు, ఓ మ‌హిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగిన‌ట్లు మంగ‌ళ‌ వారం గుజ‌రాత్ పోలీసులు తెలిపారు. పోలీసులు చెప్పిన‌ వివ‌రాల ప్ర‌కారం.. జ‌డేజా త‌న భార్య రివా సోలంకితో క‌లిసి సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో కారులో వెళ్తుండ‌గా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 6:14 PM

భార‌త క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు, ఓ మ‌హిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగిన‌ట్లు మంగ‌ళ‌ వారం గుజ‌రాత్ పోలీసులు తెలిపారు. పోలీసులు చెప్పిన‌ వివ‌రాల ప్ర‌కారం.. జ‌డేజా త‌న భార్య రివా సోలంకితో క‌లిసి సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో కారులో వెళ్తుండ‌గా వీరి వాహ‌నాన్ని త‌నిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ అడ్డ‌గించారు. కారు డ్రైవింగ్ సీట్‌లో ఉన్న జడేజా మాస్క్ ధ‌రించి ఉన్న‌ప్ప‌టికీ.. ఆమె భార్య మాస్క్ ధ‌రించ‌లేదు. దీంతో ఎందుకు మాస్క్ ధ‌రించ‌లేద‌ని ప్ర‌శ్నించ‌డంతో పాటు జ‌రిమానా చెల్లించాల‌ని మ‌హిళా పోలీస్ పేర్కొంది. దీంతో ర‌వీంద్ర జ‌డేజాకు కానిస్టేబుల్‌కు మ‌ధ్య వాద‌న పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. మ‌హిళా కానిస్టేబుల్‌తో రివిజా కూడా దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు డీసీపీ మ‌నోహ‌ర్ సింగ్ తెలిపారు.

అయితే త‌మ ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో జ‌డేజా భార్య రివా సోలంకి మాస్క్ పెట్టుకోన‌ట్టు వెల్ల‌డైన‌ట్లు డీసీపీ పేర్కొన్నారు. అస‌లు వీరి మ‌ధ్య గొడ‌వ ఎందుకు పెద్ద‌ద‌య్యింద‌నే విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌న్నారు. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత మ‌హిళా కానిస్టేబుల్ అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో.. ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆమె ఆరోగ్యం కుదుట ప‌డింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. అయితే అటు మ‌హిళా కానిస్టేబుల్ నుంచి, ఇటు జ‌డేజా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫిర్యాదులు త‌మ‌కు రాలేద‌ని డీసీపీ మ‌నోహ‌ర్ సింగ్ తెలిపారు.

Read More:

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu