India Vs Australia 2020: రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఆ మెడల్ ప్రత్యేకత ఏంటో తెలుసా…?

ఆస్ట్రేలియా భారత్ రెండో టెస్టులో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఆ అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక పేరు సైతం ఉంది. ఇంతకీ ఆ అవార్డు పేరు ఏంటంటే...

India Vs Australia 2020: రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఆ మెడల్ ప్రత్యేకత ఏంటో తెలుసా...?
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2020 | 5:23 AM

ఆస్ట్రేలియా భారత్ రెండో టెస్టులో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఆ అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక పేరు సైతం ఉంది. ఇంతకీ ఆ అవార్డు పేరు ఏంటంటే…

ములాగ్ మెడల్…

సెంచరీతో భారత్ విజయంలో కీలక భూమిక పోషించిన రహానేకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే జానీ ములాగ్‌ మెడల్‌ను కూడా రహానే దక్కించుకున్నాడు. డిసెంబర్‌ 26వ తేదీన ఆరంభమైన బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న క్రికెటర్‌కు ములాగ్‌ మెడల్‌ ఇవ్వాలని సీఏ (క్రికెట్‌ ఆస్ట్రేలియా) నిర్ణయించింది. దాంతో ఆ మెడల్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా రహానే అరుదైన ఘనతను సాధించాడు.

అవార్డు ప్రత్యేకత ఇదే…

జానీ ములాగ్‌ మెడల్‌కు ఒక ప్రతేకత ఉంది. ఇది ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన ఒక కెప్టెన్‌కు ఇచ్చిన గౌరవం. 1868 కాలంలో ఆసీస్‌కు ములాగ్‌ కెప్టెన్‌గా చేశాడు. అదే సమయంలో ఆసీస్‌ జట్టు ఇతని కెప్టెన్సీలోనే తొలి విదేశీ పర్యటనకు వెళ్లింది. ములాగ్‌ సారథ్యంలో బ్రిటన్‌లో ఆనాటి ఆసీస్‌ పర్యటించింది. ఆ సుదీర్ఘ పర్యటనలో ములాగ్‌ 47 మ్యాచ్‌లు ఆడి 1,698 పరుగులు చేశాడు. ఇక 831 ఓవర్లు బౌలింగ్‌ వేసి 245 వికెట్లు సాధించాడు. ఇక్కడ అతని యావరేజ్‌ 10.00 గా నమోదైంది. ఇక తన కెరీర్‌లో వికెట్‌ కీపర్‌ పాత్రను కూడా ములాగ్‌ పోషించాడు. అతడి పేరుమీదే ఆసిస్ రహానేకు ఈ అవార్డును అందజేసింది.