ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న స్టార్ షట్లర్ తెలుగుతేజం పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు నరసింహన్, బిశ్వభూషణ్ హరిచందన్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, మంత్రి ఈటల రాజేందర్ తదితరులు అభినందనలు తెలిపారు.
అంకితభావం, పట్టుదలతో విజయం సాధించిన సింధు.. మరోసారి దేశం గర్వపడేలా చేసింది.- ప్రధాని మోదీ
The stupendously talented @Pvsindhu1 makes India proud again!
Congratulations to her for winning the Gold at the BWF World Championships. The passion and dedication with which she’s pursued badminton is inspiring.
PV Sindhu’s success will inspire generations of players.
— Narendra Modi (@narendramodi) August 25, 2019
సింధు అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. – తెలంగాణ సీఎం కేసీఆర్
Many Congratulations to @Pvsindhu1 on winning #BWFWorldChampionships2019.#PVSindhu pic.twitter.com/2TYcHEwRws
— TRS Party (@trspartyonline) August 25, 2019
Many many congratulations to @Pvsindhu1 on winning gold at #BadmintonWorldChampionships2019 👏👏 what a fabulous performance 👍
May your success inspire many more youngsters to dream big & bring glory to India 🇮🇳 ✌️
— KTR (@KTRTRS) August 25, 2019
సింధు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. సింధు విజయ పరంపర ఇలాగే కొనసాగాలి. -ఏపీ సీఎం జగన్
Historical Victory! Congratulations @Pvsindhu1 for becoming the first Indian to win the gold medal at #BWFWorldChampionships. Dominated right from the start and finished like a true champion. 👏👏
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 25, 2019
అద్భుతమైన ఆటతీరు, అసాధారణ ప్రతిభతో సింధు లక్ష్యాన్ని సాధించింది. ఆమె స్వర్ణ పతకం సాధించడం తెలుగు వారందరికీ గర్వకారణం. పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి గౌరవించాం. ఆమె భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. – తెదేపా అధినేత చంద్రబాబు
https://twitter.com/ncbn/status/1165614130365026305