Pele: పీలే ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్‌.. తన హెల్త్‌ కండిషన్‌పై స్వయంగా సందేశం పంపిన సాకర్ దిగ్గజం

82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్‌ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నాడు. అయితే తాజాగా అనారోగ్యం బారిన పడడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆస్పత్రిలో పీలేను చేర్పించారు.

Pele: పీలే ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్‌.. తన హెల్త్‌ కండిషన్‌పై స్వయంగా సందేశం పంపిన సాకర్ దిగ్గజం
Pele
Follow us

|

Updated on: Dec 04, 2022 | 2:46 PM

బ్రెజిలియన్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే రిటైర్ అయ్యి కొన్నేళ్లు గడిచి ఉండవచ్చు. కానీ అతను ఇప్పటికీ ప్రతి ఫుట్‌బాల్ ప్రేమికుడి హృదయంలో ఉన్నాడు. అందుకే అతను అనారోగ్యం బారిన పడ్డడాని వార్త తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్‌ అభిమానులు తల్లడిల్లిపోయారు. అతనికి ఏమీ కాకూడదని, త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. . 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్‌ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నాడు. అయితే తాజాగా అనారోగ్యం బారిన పడడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆస్పత్రిలో పీలేను చేర్పించారు. ఆదివారం ఉదయం వరకు కూడా పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. దీంతో అతని అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. అయితే తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులపై పీలే స్వయంగా స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. ‘ఫ్రెండ్స్‌.. నేను చాలా బాగా ఉన్నాను. నా కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందవద్దు. నేను సానుకూల దృక్పథంతోనే ఉన్నాను. చికిత్స కొనసాగుతోంది. భగవంతుడిపై తనకు అపార నమ్మకం ఉంది. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోంది. నా కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు’ అని తన ఫ్యాన్స్‌కు సందేశం పంపాడు ఫుట్ బాల్ దిగ్గజం.

ప్రపంచకప్‌లోనూ పీలే హోరు..

1958, 1962, 1970లో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే కీలక పాత్ర పోషించాడు. జాతీయ జట్టు తరఫున 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేశాడు. అంతేకాదు బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డలకెక్కాడు. కాగా శుక్రవారం కామెరూన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ అభిమానులు పీలేను గుర్తు చేసుకున్నారు. ఖతార్‌లోని బ్రెజిల్ అభిమానులు పీలే చిత్రంతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించారు. అందులో పీలే, త్వరగా కోలుకోవాలని రాశారు.అలాగే స్టేడియంలో ఉన్న ఒక అభిమాని పీలే ఫొటోతో కూడిన జెర్సీని ధరించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pelé (@pele)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!