Musa Yamak: బాక్సింగ్‌ రింగ్‌లోనే కుప్పకూలిపోయిన బాక్సర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

టర్కిష్-జర్మన్ బాక్సర్(Boxer) ముసా యమక్(Musa Yamak) బాక్సింగ్‌ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. మ్యూనిచ్‌లో జరిగిన పోరులో ఉగాండా చెందిన హంజా వండేరాతో తలపడుతుండగా రింగ్‌లో ముసా యమక్‌ మరణించాడు...

Musa Yamak: బాక్సింగ్‌ రింగ్‌లోనే కుప్పకూలిపోయిన బాక్సర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Musa Yamak
Follow us

|

Updated on: May 19, 2022 | 6:03 PM

టర్కిష్-జర్మన్ బాక్సర్(Boxer) ముసా యమక్(Musa Yamak) బాక్సింగ్‌ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. మ్యూనిచ్‌లో జరిగిన పోరులో ఉగాండా చెందిన హంజా వండేరాతో తలపడుతుండగా రింగ్‌లో ముసా యమక్‌ మరణించాడు. అతని అకాల మరణానికి హీట్ అరెస్ట్(Heat Arrest) కారణమని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య, గ్లోబల్ బాక్సింగ్ యూనియన్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలిచిన ఇతను తన బౌట్‌లో మూడో రౌండ్‌కు ముందే కుప్పకూలిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని అతను తరువాతి రౌండ్‌కు తిరిగి వచ్చాడు. ప్రారంభ గంటకు ముందే అతను మళ్లీ కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే రింగ్‌ను చుట్టుముట్టి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గుండె ఆగిపోవడంతో అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటన తర్వాత మైదానంలో నిశేబ్ధం అలుముకుంది. 2017లో ప్రొఫెషనల్‌గా మారిన 38 ఏళ్ల యమక్ అజేయమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు 84 కేజీల విభాగంలో పోటీ పడుతున్నాడు. “మరణించిన శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అని టర్కీ అధికారి హసన్ తురాన్ అన్నారు. 75 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన ఈ బాక్సర్ టర్కీలోని అలుక్రా ప్రాంతంలో జన్మించాడు. అతను WBF, GBU బెల్ట్‌లను పట్టుకుని ఆసియా-యూరప్ లైట్ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యాడు. ఇస్తాంబుల్‌లో జరిగిన యుద్ధంలో గెలిచి 2019లో యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచినందున యమక్ జర్మనీలో అత్యంత అనుభవజ్ఞుడైన బాక్సర్‌లలో ఒకరిగా పరిగణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడవార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..