DFB-పోకల్ కప్ ఫైనల్‌లో కీలక కార్యక్రమాలను ప్రకటించిన టీవీ9 ఎండీ, సీఈవో బరున్ దాస్.. వివరాలు ఇవే..

| Edited By: Shaik Madar Saheb

Jun 01, 2024 | 3:04 PM

భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్.. TV9 నెట్‌వర్క్ మే 25న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన DFB-పోకల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 3 ప్రత్యేక కర్టైన్ రైజర్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ పలు విషయాలను పంచుకున్నారు. బ్రాడ్‌కాస్టింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన మెగా సమ్మిట్.. TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో జర్మనీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

DFB-పోకల్ కప్ ఫైనల్‌లో కీలక కార్యక్రమాలను ప్రకటించిన టీవీ9 ఎండీ, సీఈవో బరున్ దాస్.. వివరాలు ఇవే..
Tv9 Network Md & CEO Mr Barun Das
Follow us on

భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్.. TV9 నెట్‌వర్క్ మే 25న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన DFB-పోకల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 3 ప్రత్యేక కర్టైన్ రైజర్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ పలు విషయాలను పంచుకున్నారు.  బ్రాడ్‌కాస్టింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన మెగా సమ్మిట్.. TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) ఈ ఏడాది ఆగస్టు – సెప్టెంబర్‌లో జర్మనీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఫుట్‌బాల్ కు సంబంధించి మరో రెండు కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఒకటి.. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ కాగా.. మరొకటి ఫుట్‌బాల్9 గా తెలిపారు.

ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ ద్వారా దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు బాలబాలికల ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ చేపడతామని వివరించారు. అలాగే ఫుట్‌బాల్9 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా జర్మనీ ఫుట్‌బాల్ కు భారత్‌లో ప్రాచుర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ కోసం TV9 నెట్‌వర్క్ యూరప్‌లోని టాప్ ఫుట్‌బాల్ లీగ్ బుండెస్లిగాతో చేతులు కలిపింది. టీవీ9 దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత 20 మంది బాలురు, 20 మంది బాలికలు షార్ట్‌లిస్ట్‌ అవుతారు. ఈ షార్ట్‌లిస్ట్ చేసిన పిల్లలకు జర్మనీ, ఆస్ట్రియాలోని యూరోపియన్ ఫుట్‌బాల్ నిపుణులు శిక్షణ ఇస్తారు. జర్మనీ DFL కప్ ఫైనల్‌లో కూడా వీరు పాల్గొంటారు.

ఈ ప్రత్యేక కర్టెన్ రైజర్‌ కార్యక్రమానికి గౌరవ అతిథిగా జర్మనీలోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ పర్వతనేని హరీష్ హాజరయ్యారు.  జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (DFB) అధ్యక్షుడు బెర్న్డ్ న్యూఎండోర్ఫ్, ఆస్ట్రియాలోని ఇండియా ఫుట్ బాల్ సెంటర్ ఫౌండర్ గెర్హార్డ్ రీడ్ల్‌లతో సహా భారత్, జర్మనీ, ఆస్ట్రియాకు చెందిన ఫుట్‌బాల్ క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వీడియో చూడండి..

జర్మనీలో నిర్వహించిన ఈ ఈవెంట్ లో బరున్ దాస్ మాట్లాడుతూ.. “మన దేశం నుంచి ఒక్క ఫుట్ బాల్ ఆటగాడు కూడా ప్రపంచ టాప్ ఫుట్ బాల్ లీగ్ లో పాల్గొనలేకపోతున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత్ ఇప్పటికీ ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ కలను సాకారం చేసుకోవడానికి, TV9 జర్మనీ ఫుట్‌బాల్ లీగ్ బుండెస్లిగా సహకారంతో కీలక అడుగు వేసింది. ఇది కేవలం ఫుట్‌బాల్ మాత్రమే కాకుండా భారత్, జర్మనీల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తుంది’ అని ఆయన అన్నారు.

“అండర్-14 బాలబాలికల కోసం ఫుట్‌బాల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్‌ను ప్రారంభించాం. మా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఫుట్‌బాల్9ని జర్మనీలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. బెర్లిన్‌లోని ఒలంపిక్ స్టేడియంలో జరిగిన DFB-పోకల్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమైన గౌరవం, మన ఆశయానికి తగినట్లుగా ఉంటుంది. DFB అసోసియేషన్ ఇండియన్ టైగర్స్ & టైగ్రెస్‌ల విజయానికి ఎంతగానో సహాయపడుతుంది. దీంతో భారతదేశం అగ్ర ఫుట్‌బాల్ దేశాలలో ఒకటిగా మారుతుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’ అని బరున్ దాస్ తెలిపారు.

జర్మనీలో భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. “భారతదేశం, జర్మనీ ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. జర్మనీ ఐరోపాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. కానీ, జర్మనీలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికత, ప్రతిభను, ముఖ్యంగా భారతదేశానికి చెందిన విద్యార్థుల సహాయంతో పెంచడానికి భారీగా అవకాశం ఉంది. రెండు దేశాలను మరింత దగ్గర చేసేందుకు టీవీ9 చేస్తున్న కార్యక్రమాల పట్ల నేను సంతోషిస్తున్నాను’ అని అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..