Indian Hockey : మనోళ్లు మామూలోళ్లు కాదు.. హాకీలో భారత్ సునామీ.. అభినందించిన ప్రధాని మోదీ

ఏషియా కప్ 2025 ఫైనల్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ గంభీర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అభినందనలు తెలిపారు. ఈ విజయంతో 2026 హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.

Indian Hockey :  మనోళ్లు మామూలోళ్లు కాదు.. హాకీలో భారత్ సునామీ.. అభినందించిన ప్రధాని మోదీ
Indian Hockey

Updated on: Sep 08, 2025 | 11:06 AM

Indian Hockey : భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశమంతా సంబరాలు చేసుకుంటుంది.భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆసియా కప్ 2025 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను 4-1 తేడాతో చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్, కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

ప్రధాని మోడీ, గౌతమ్ గంభీర్ ప్రశంసలు

హాకీ జట్టు విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. “రాజ్‌గిర్‌లో జరిగిన ఆసియా కప్ 2025లో మన పురుషుల హాకీ జట్టు సాధించిన అద్భుతమైన విజయం పట్ల నా హృదయపూర్వక అభినందనలు. డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను ఓడించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. ఇది భారత హాకీ, భారత క్రీడలకు గర్వకారణం” అని అన్నారు.

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విజయంపై స్పందిస్తూ.. “వెల్ డన్ బాయ్స్! అద్భుతం!” అని పోస్ట్ చేశారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా జట్టును అభినందించారు.

వరల్డ్ కప్‌కి డైరెక్ట్ ఎంట్రీ!

ఈ విజయం భారత పురుషుల హాకీ జట్టుకు కేవలం ఆసియా కప్ టైటిల్‌ను మాత్రమే కాకుండా, 2026 హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కూడా కల్పించింది. భారత జట్టు చివరిసారిగా 2017లో ఢాకాలో ఆసియా కప్ గెలిచింది.

జట్టు సభ్యులకు బహుమతి

ఆసియా కప్ విజయం తర్వాత, హాకీ ఇండియా జట్టు సభ్యులకు బహుమతులను ప్రకటించింది. ప్రతి ఆటగాడికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ అద్భుతమైన విజయం భారత హాకీకి ఒక కొత్త ఊపునిచ్చింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..