Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్‌లో సత్తా చాటిన జట్టు ఇదే.. ఏకంగా 4సార్లు ట్రోఫీ పట్టేసిందిగా.. పూర్తి జాబితా ఇదే..

Venkata Chari

Venkata Chari |

Updated on: Jan 13, 2023 | 1:19 PM

పురుషుల 15వ హాకీ ప్రపంచ కప్ ప్రారంభమైంది. 17 రోజుల్లో 16 జట్ల మధ్య మొత్తం 44 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 29న హాకీ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌ రానుంది.

Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్‌లో సత్తా చాటిన జట్టు ఇదే.. ఏకంగా 4సార్లు ట్రోఫీ పట్టేసిందిగా.. పూర్తి జాబితా ఇదే..
Hockey World Cup Winners Li

పురుషుల హాకీ ప్రపంచకప్ చరిత్ర చాలా పాతది. 1971లో తొలిసారిగా ఈ టోర్నీని నిర్వహించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరం ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ టైటిల్ పాకిస్థాన్ కు వచ్చినప్పటికీ స్పెయిన్ జట్టు కూడా ఫైనల్స్ కు చేరుకుంది. గత 52 ఏళ్లలో హాకీ ప్రపంచకప్ 14 సార్లు నిర్వహించారు. ఇందులో పాక్ జట్టు అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకుంది. పాకిస్థాన్ మొత్తం 4 సార్లు టైటిల్ గెలుచుకుంది.

పాకిస్థాన్ తర్వాత ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలో 3 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి. అదే సమయంలో జర్మనీ కూడా రెండుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో, బెల్జియం చివరిసారి ఛాంపియన్‌గా నిలిచింది.

భారత హాకీ జట్టు కూడా ఒకసారి టైటిల్ గెలుచుకోగలిగింది. 1975 హాకీ ప్రపంచకప్ భారత్ జట్టును చేరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు.. గత 48 ఏళ్లుగా ఈ టోర్నీలో భారత జట్టు ఎలాంటి పతకం సాధించలేదు. ఇప్పుడు ఒడిశాలో 15వ హాకీ ప్రపంచకప్ ప్రారంభం కావడంతో ఇక్కడ పతకాల కరువుకు తెరపడాలని భారత జట్టు కోరుకుంటోంది.

అత్యధిక సార్లు ఇక్కడ ఫైనల్స్ ఆడిన రికార్డు నెదర్లాండ్స్ పేరిట నమోదైంది. నెదర్లాండ్స్ జట్టు ఫైనల్స్‌కు 7 సార్లు చేరింది. పాకిస్థాన్ 6, ఆస్ట్రేలియా 5 ఫైనల్స్ ఆడాయి. భారత జట్టు రెండుసార్లు ఫైనల్ చేరింది.

హాకీ ప్రపంచకప్‌ను ఎవరు ఎప్పుడు గెలుచుకున్నారంటే?

హాకీ ప్రపంచ కప్ 1971: పాకిస్తాన్

హాకీ ప్రపంచ కప్ 1973: నెదర్లాండ్స్

హాకీ ప్రపంచ కప్ 1975: భారతదేశం

హాకీ ప్రపంచ కప్ 1978: పాకిస్తాన్

హాకీ ప్రపంచ కప్ 1982: పాకిస్తాన్

హాకీ ప్రపంచ కప్ 1986: ఆస్ట్రేలియా

హాకీ ప్రపంచ కప్ 1990: నెదర్లాండ్స్

హాకీ ప్రపంచ కప్ 1994: పాకిస్తాన్

హాకీ ప్రపంచ కప్ 1998: నెదర్లాండ్స్

హాకీ ప్రపంచ కప్ 2002: జర్మనీ

హాకీ ప్రపంచ కప్ 2006: జర్మనీ

హాకీ ప్రపంచ కప్ 2010: ఆస్ట్రేలియా

హాకీ ప్రపంచ కప్ 2014: ఆస్ట్రేలియా

హాకీ ప్రపంచ కప్ 2018: బెల్జియం

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu