Khelo India: ఖేలో ఇండియా నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ 2016-17 కింద రూ. 3073.97 కోట్ల విలువైన 323 కొత్త స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడలలో విస్తృత భాగస్వామ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
2017-18 నుంచి 2019-20 వరకు 1756 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో ఈ పథకానికి 328.77 కోట్ల రూపాయల బడ్జెట్ అందింరచగా.. 2020-21 వరకు ఒక సంవత్సరం పాటు మధ్యంతర పొడిగింపు ఇచ్చారు.
మాండవ్య మాట్లాడుతూ, “ఖేలో ఇండియా పథకం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం ద్వారా దేశవ్యాప్తంగా క్రీడల అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. 323 కొత్త క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదంతో 1041 ఖేలో ఇండియా కేంద్రాలు (KICలు) ఉన్నాయి. ఇందులో భాగంగా పిల్లలకు శిక్షణ అందించడం, మాజీ క్రీడాకారులకు మద్దతు ఇవ్వడం, అట్టడుగు స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
“301 అకాడమీలు ఖేలో ఇండియా పథకం కింద మద్దతు ఇచ్చే క్రీడా సౌకర్యాలు దేశంలోని పౌరులందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు, 2781 మంది ఖేలో ఇండియా అథ్లెట్లకు (KIA) కోచింగ్, పరికరాలు, వైద్య సంరక్షణ, నెలవారీ పాకెట్ మనీ భత్యం అందజేస్తున్నారు” ఆయన తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..