Corona Effect: ‘టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయండి’.. కరోనా నేపథ్యంలో జపాన్‌ వాసుల మనసులో మాట..

Corona Effect On Tokyo Olympics: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా ప్రేక్షకులు...

  • Narender Vaitla
  • Publish Date - 3:00 pm, Tue, 13 April 21
Corona Effect: 'టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయండి'.. కరోనా నేపథ్యంలో జపాన్‌ వాసుల మనసులో మాట..
Tokyo

Corona Effect On Tokyo Olympics: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా ప్రేక్షకులు లేకుండా అనుమతులిస్తూ నడిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్‌ కూడా పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు చెందిన ఆటగాళ్లు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అవుతారనే ఉద్దేశంతో ఈ క్రీడలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి ఒలింపిక్స్‌ క్రీడలను జపాన్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జపాన్‌లో కరోనా తన పంజాను విసురుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటంటూ క్యోడో అనే న్యూస్‌ ఏజెన్సీ ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో జపాన్‌ వాసులను ప్రశ్నిస్తూ ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో సుమారు 70 శాతం మంది టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడమో… లేక మరోసారి వాయిదా వేయాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక 39.2 శాతం మంది ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడాన్ని సమర్థించగా… 32.8 శాతం ప్రజలు మరోసారి వాయిదా వేయాలని కోరుకున్నారు. కేవలం 24.5 శాతం మంది మాత్రమే అనుకున్న షెడ్యూల్‌లోనే క్రీడలను నిర్వహించాలని కోరారు. ఒలింపిక్స్‌ క్రీడల కౌంట్‌డౌన్‌ 100 రోజులకు చేరుకోగా… సోమవారం నుంచి నెల రోజుల పాటు పాక్షిక–అత్యవసర పరిస్థితిని విధిస్తూ జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ క్రీడలపై మరోసారి నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మరి ఈసారైనా ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతాయా.? లేదా మరోసారి వాయిదా పడతాయో చూడాలి.

Also Read: IPL 2021: అంపైర్ వార్నింగ్‌తో బౌలింగ్‌ ఛేంజ్..! ఆఫ్ స్పిన్‌ వదిలేసి ఇదేం బౌలింగ్‌ బాసు..?

Chennai Super Kings: బ్యాట్ వదిలి గరిట పెట్టిన ఐపీఎల్ క్రికెటర్స్… టీమ్ సభ్యుల కోసం పసందైన వంటలతో అలరించిన వైనం

20 బంతుల్లో 50 పరుగులు..! ఒకే ఫోర్.. మిగతావి మొత్తం సిక్స్‌లే.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడు..