Indian Wrestler: వరల్డ్ నెంబర్ వన్‌గా భారత కుస్తీ వీరుడు..స్వర్ణ పతకం సొంతం చేసుకున్న బజరంగ్‌

మరోసారి విశ్వ విజేతగా నిలిచాడు భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా.తన వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో..

Indian Wrestler: వరల్డ్ నెంబర్ వన్‌గా భారత కుస్తీ వీరుడు..స్వర్ణ పతకం సొంతం చేసుకున్న బజరంగ్‌
Indian wrestler Bajrang Punia regains world number one rank
Follow us

|

Updated on: Mar 08, 2021 | 8:07 PM

Bajrang Punia Takes Gold: మరోసారి విశ్వ విజేతగా నిలిచాడు భారత కుస్తీ వీరుడు బజరంగ్‌ పునియా.తన వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో అతడు స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు.ఫైనల్లో మంగోలియా ఆటగాడు తుల్గా తుమర్‌ ఒచిర్‌ను ఓడించాడు.

ముందుగా ప్రత్యర్థిని 2-0తో ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో చివరి వరకు పోరాడిన బజరంగ్‌ పునియా చివరి 30 సెకన్లలో 2 పాయింట్లను దక్కించుకుని స్కోరు సమం చేశాడు. అయితే స్కోరు సమానం అయినప్పటికీ.. రూల్స్ ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారికే విజయం దక్కుతుంది. కోవిడ్ వైరస్‌ కారణంగా ఏడాదిపాటు ఆటకు దూరమైన బజరంగ్‌ తన డిఫెన్స్‌ను మరింత మెరుగు పర్చుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.

రెండో ర్యాంకుతో సిరీసులోకి ఎంట్రీ ఇచ్చిన బజరంగ్‌ ఈ విజయంతో అగ్రస్థానంను దక్కించుకున్నాడు. చివరి వరకు ఒచిర్‌పై ఇబ్బంది పడటానికి కారణం తాను పోటీ ఉన్న 65 కిలోల విభాగంలో ఉన్నానని వెల్లడించాడు. మంగోలియన్‌ ఆటగాడు ఒచిర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒచిర్ బలహీన ప్రత్యర్థి కాదని అన్నాడు. ఈ విభాగంలో ప్రతి రెజ్లర్‌ టోక్యోలో అదరగొట్టాలన్న కసితో ఆడుతున్నారని బజరంగ్ వెల్లడించాడు.

కుస్తీలో ఒడుదొడుకులు తప్పవని… ఏదేమైనా తిరిగి రింగులో అడుగు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తన అభిప్రాయపడ్డాడు. ఐరోపాలో కోవిడ్ ఆంక్షలు మళ్లీ విధిస్తుండటం వల్ల ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లడమైతే తేలిక కాదని బజరంగ్‌ తెలిపాడు. విశాల్‌కు కాంస్యంభారత్‌కే చెందిన మరో రెజ్లర్‌ విశాల్‌ కాళిరామన్‌ 70 కిలోల విభాగంలో కాంస్యం అందుకున్నాడు.

కజక్‌స్థాన్‌ ఆటగాడు సిర్బజ్‌ తల్గట్‌పై 5-1 తేడాతో ఘన విజయం సాధించాడు. కాగా ఈ విభాగం ఒలింపిక్స్‌లో లేదు.డోపింగ్‌ పరీక్షల్లో విఫలమై నాలుగేళ్లు నిషేధానికి గురైన నర్సింగ్‌ యాదవ్‌ పతకం అందుకోవడంలో విఫలమయ్యాడు. కాంస్య పోరులో 0-5 తేడాతో డేనియర్‌ కైసనోవ్‌ చేతుల్లో పరాజయం పాలయ్యాడు. మొత్తంగా ఈ సిరీసులో భారత్‌ ఏడు పతకాలు కైవసం చేసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ – చైనా మధ్య కోల్డ్ వార్‌.. వివాదంగా మారిన అమ్మాయి డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియా వేదికగా రచ్చ..

CSK IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ సేన ఆడబోయే మ్యాచ్‌లు.. తేదీలు,వేదికలను ఇక్కడ చూడొచ్చు!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..