త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా… సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా

బ్యాడ్మింటన్ సీనియర్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మళ్లీ అడుతానంటున్నారు. తిరిగి షటిల్​ కోర్టులో అడుగుపెట్టనంటున్నారు. ఆటకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని తేల్చి చెప్పారు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:04 pm, Sat, 16 January 21
త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా... సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా

Jwala Gutta Will be Back : బ్యాడ్మింటన్ సీనియర్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మళ్లీ అడుతానంటున్నారు. తిరిగి షటిల్​ కోర్టులో అడుగుపెట్టనంటున్నారు. ఆటకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని తేల్చి చెప్పారు. బిహార్​లోని మోతీహారిలో శుక్రవారం జరిగిన ‘రన్​ ఫర్​ పీస్​’ కార్యక్రమంలో ఈ సంచలన విషయాలను వెల్లడించారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. కేవలం విరామం తీసుకున్నానంటూ పేర్కొన్నారు.

త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా… మన దేశంలో క్రీడలను అంత సీరియస్​గా తీసుకోమని… వాటిని వృత్తిగా ఎంచుకునేలా చేయడానికి తాను కృషి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. గతేడాది హైదరాబాద్​లో ఓ బ్యాడ్మింటన్​ అకాడమీని ఏర్పాటు చేసింది జ్వాలా. తన అకాడమీలో చేరుతున్న క్రీడాకారుల సంఖ్య పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.