Soccer Match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య గొడవ.. 26మందికి గాయాలు.. చర్యలు తీసుకుంటామన్న ఫిఫా అధికారులు

Soccer Match: అభిమానం హద్దులు దాటితే.. వివాదాలు నెలకొంటాయి. ఒకొక్కసారి ఆ అభిమానం ప్రాణాలు పోగొట్టుకునే వరకూ.. లేదా ఇతరుల ప్రాణాలను తీసేవరకూ వెళ్తాయి. తాజాగా మెక్సికో(Mexico)లోని క్వెరెటారో(Queretaro) నగరంలో..

Soccer Match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య గొడవ.. 26మందికి గాయాలు.. చర్యలు తీసుకుంటామన్న ఫిఫా అధికారులు
Mexican Soccer Match
Follow us

|

Updated on: Mar 07, 2022 | 10:14 AM

Soccer Match: అభిమానం హద్దులు దాటితే.. వివాదాలు నెలకొంటాయి. ఒకొక్కసారి ఆ అభిమానం ప్రాణాలు పోగొట్టుకునే వరకూ.. లేదా ఇతరుల ప్రాణాలను తీసేవరకూ వెళ్తాయి. తాజాగా మెక్సికో(Mexico)లోని క్వెరెటారో(Queretaro) నగరంలో జరిగిన మెక్సికన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది.  మ్యాచ్ జరుగుతున్న సమయంలో  62వ నిమిషంలో స్టాండ్స్‌లో అభిమానుల వివాదం మోడలింది. ఈ ఘర్షణలో 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘర్షణ మొదలైన వెంటనే ఆటను నిలిపివేశారు. మహిళలు, పిల్లలు సహా అభిమానులు స్టాండ్స్ నుంచి తప్పించుకునేందుకు వీలుగా భద్రతా సిబ్బంది మైదానంలోకి గేట్లు తెరిచారు. క్వెరెటారో, అట్లాస్ జట్ల మధ్య ఆట ప్రారంభమైన కాసేపటికే ఈ గొడవలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. పది మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. గాయపడిన వారందరూ పురుషులేనని.. క్షతగాత్రుల్లో ప్రస్తుతం నలుగురు జాలిస్కో రాష్ట్రానికి చెందినవారని నిర్ధారించారు.

ఈ ఘటనపై స్పందించిన ఫిఫా అధికారులు.. ఈ ఘటనను ఖండిస్తున్నామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఘర్షణ సమయంలో మానిటర్ ధ్వంసమైంది. తమ ఆటగాళ్లు, అభిమానుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మ్యాచ్ నిర్వాహకులు వెల్లడించారు. అందరూ కలిసి ఒకే సారి దాడికి పాల్పడడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయారన్నారు. ఫలితంగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారని, పరిస్థితి చేజారిపోతుండటంతో వారు భయంతో పరుగులు తీశారని వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడలని కోరారు.

లీగ్ ప్రెసిడెంట్ మైకెల్ అరియోలా తన ట్విట్టర్ ఖాతాలో హింసను ఖండించింది. స్టేడియంలో భద్రతా లోపానికి కారణమైన వారిని శిక్షిస్తామని చెప్పారు

Also Read:

స్పిన్‌ దిగ్గజం గదిలో రక్తపు మరకలు.. థాయ్‌ పోలీసులు ఏం చెబుతున్నారంటే..