20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆంధ్రా అథ్లెట్.. ప్రశంసలు కురిపించిన ఒడిశా ప్లేయర్..

యెర్రాజీ జ్యోతి మధ్య తరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, తల్లి ఇంట్లోనే ఉంటుంది. హకీంపేట(హైదరాబాద్‌)లో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్న జ్యోతి..

20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆంధ్రా అథ్లెట్.. ప్రశంసలు కురిపించిన ఒడిశా ప్లేయర్..
Jyothi Yarraji, Anuradha Biswal Routray
Follow us

|

Updated on: May 13, 2022 | 10:54 AM

ఒక రికార్డుకు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. సమయం గడిచేకొద్దీ ఈ రికార్డుకు బ్రేకులు పడే చాన్స్ రావొచ్చు, రాలేకపోవచ్చు. అయితే క్రీడలకు సంబంధించి కొన్ని రికార్డులు ఎప్పటికీ మారుతూనే ఉంటాయి. మరికొన్ని మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఓ యువ అథ్లెట్‌, తెలుగమ్మాయి అయిన యెర్రాజీ జ్యోతి విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. సైప్రస్ అంతర్జాతీయ మీట్‌లో 20 ఏళ్లనాటి ఓ రికార్డును బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యెర్రాజీ జ్యోతి సైప్రస్ అంతర్జాతీ అథ్లెటిక్ మీట్‌లో భారతదేశం తరపున మంగళవారం బరిలోకి దిగింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌‌లో బరిలోకిదిగిన ఈమె.. కేవలం 13.23 సెకన్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, తొలి స్థానంలో నిలిచింది. దీంతో 20 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా.. స్వర్ణ పతకం సాధించింది. అంతకుముందు ఒడిశాకు చెందిన అనురాధా బిస్వాల్‌ 20 ఏళ్ల కిందట 100 మీటర్ల హర్డిల్స్‌లో 13.38 సెకన్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇన్నాళ్లకు ఈ రికార్డును ఏపీకి చెందిన జ్యోతి బ్రేక్ చేయడం విశేషం.

Also Read: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత్.. 43 ఏళ్ల నిరీక్షణకు తెర..

కాగా, ఏప్రిల్‌లో కోజికోడ్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో ఈ తెలుగమ్మాయి కేవలం 13.09 సెకన్లతో సత్తా చాటింది. కానీ, గాలివాటం కారణంగా ఈ రికార్డ్ ఛేదనను లెక్కలోకి తీసుకోలేదు. అంతకుముందు అంటే గతేడాది అఖిల భారత అంతర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ కేవలం 13.03 సెకన్లలో 100 మీటర్ల హర్డిల్స్‌ను పూర్తి చేసింది. ఈసారి కూడా ఈ రికార్డుకు తగిన గుర్తింపు దక్కలేదు. కారణం, జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) జ్యోతిని పోటీల సమయంలో టెస్ట్ చేయకపోవడంతో నిరాశే ఎదురైంది. కానీ, మంగళవారం జరిగిన పోటీల్లో మాత్రం ఎటువంటి తప్పునకు ఆస్కారం ఇవ్వలేదు. రికార్డ్ ఛేదనను పూర్తి చేసి, ఈసారి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా, యెర్రాజీ జ్యోతి మధ్య తరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, తల్లి ఇంట్లోనే ఉంటుంది. హకీంపేట(హైదరాబాద్‌)లో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్న జ్యోతి.. ఇప్పుడు ఒడిశా అథ్లెటిక్స్‌ హై పర్ఫార్మెన్స్‌ కేంద్రంలో శిక్షణ పొందుతోంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో నేషనల్ రికార్డు నెలకొల్పడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా జ్యోతి పేరు మారుమోగిపోతోంది. కాగా, ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిందని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి దేశానికి పేరు తెస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.

ఆశ్చర్యం ఏంటంటే, అనురాధా మాట్లాడుతూ, తన రికార్డ్ బద్దలైందని చెప్పగానే ఆ వార్త చదవాలనిపించింది. దాన్ని బద్దలు కొట్టగలిగేది యోర్రాజీ మాత్రమేనని నాకు తెలుసంటూ పేర్కొంది. “రెండుసార్లు ఆ అమ్మాయి నా రికార్డుకు చాలా దగ్గరికి వచ్చింది. క్రీడాకారిణిగా, ఆమె ప్రతిభ, సామర్థ్యం నాకు బాగా నచ్చింది. నా రికార్డ్ బ్రేక్ చేసింది యోర్రాజీ అని నేను చాలా సంతోషించాను” అని అనురాధ చెప్పుకొచ్చారు.

ఆ రికార్డును బద్దలు కొట్టడానికి ముందు రోజు రాత్రి జరిగిన విషయాలను కూడా ఆమె వివరించారు. ‘అది అక్టోబర్ 2002. నాకు నిద్ర కష్టమైంది. నేను విరామం లేకుండా ఉన్నాను, నేను వెంటనే ట్రాక్‌లోకి వెళ్లాలనుకున్నాను. ఒక అథ్లెట్ కొన్ని సమయాల్లో మంచి అనుభూతి చెందుతాడు, శారీరకంగా దృఢంగా భావిస్తారు, అత్యుత్తమ ఆటను చూపాలని” కోరుకుంటారు అని అనురాధ తెలిపింది. “ఆ సమయంలో నా కోచ్ యూరి అలెగ్జాండర్ రేసు తర్వాత చిరునవ్వులు చిందించాడు. నేను జాతీయ రికార్డును బద్దలు కొట్టినట్లు నాకు తెలుసు” అని ఆమె పేర్కొంది.

యోర్రాజీ జాతీయ రికార్డును అనేకసార్లు బద్దలు కొట్టగలదని అనురాధ నమ్ముతుంది. “కాంటినెంటల్, ప్రపంచ స్థాయిలో ఆమె నిలకడగా గెలుపొందడం చాలా కీలకం” అంటూ సూచనలు చేసింది. అనురాధ తన రికార్డును బద్దలు కొట్టిన వీడియో క్లిప్‌ను చూసిన తర్వాత మాట్లాడుతూ, “ఆమె (యోర్రాజీ) చివరి 30 మీటర్లతో చాలా ఆకట్టుకుంది. ఒక అథ్లెట్‌గా ఆ ముగింపుని కలిగి ఉంటే, ప్రత్యేకించి సాంకేతికంగా ఉన్న హర్డిల్స్‌లో 100మీ ఫ్లాట్‌తో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టవచ్చు” అంటూ ప్రశంసించింది. యోర్రాజీ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, ఒడిశా అథ్లెటిక్స్ హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో జోసెఫ్ హిల్లియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతుంది. ఈ శిక్షణ ఆమె కెంతో కీలకం కానుంది. ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటేందుకు ఎంతో ఉపయోగపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: The World’s Highest Paid Athletes 2022: ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు.. లిస్టులో ఏకైక భారత క్రికెటర్..

IPL 2022: పేరుకే అన్ క్యాప్డ్ ప్లేయర్స్.. ఆటలో మాత్రం తోపులు.. బంతి విసిరితే బ్యాట్స్‌మెన్ బుర్ర తిరగాల్సిందే..

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం