ఇది కదా ఆటంటే! వింబుల్డన్‌ జకోవిచ్‌దే

జులై 14, 2019..ప్రపంచ క్రీడా అభిమానులు మర్చిపోలేని రోజు. ఒకవైపు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..సూపర్ ఓవర్ వరకు సాగి..అభిమానులకు కిక్ ఇస్తే.. మరోవైపు టెన్నీస్ చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అసలు అదేదో యుద్దంలా ఈ పోరు సాగిందంటే ఆశ్యర్యం కాదు. రోజర్‌ ఫెదరర్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ మధ్య వింబుల్డన్‌ ఫైనల్‌ లాంటి మ్యాచ్ భవిష్యత్‌లో జరుగుతుందని చెప్పడానికి కూడా వీల్లేదు. కప్ గెలవకపోతే ప్రాణం పోతుందేమో, దేశం నుంచి వెలి […]

ఇది కదా ఆటంటే! వింబుల్డన్‌ జకోవిచ్‌దే
Follow us

|

Updated on: Jul 15, 2019 | 7:32 AM

జులై 14, 2019..ప్రపంచ క్రీడా అభిమానులు మర్చిపోలేని రోజు. ఒకవైపు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..సూపర్ ఓవర్ వరకు సాగి..అభిమానులకు కిక్ ఇస్తే.. మరోవైపు టెన్నీస్ చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అసలు అదేదో యుద్దంలా ఈ పోరు సాగిందంటే ఆశ్యర్యం కాదు. రోజర్‌ ఫెదరర్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ మధ్య వింబుల్డన్‌ ఫైనల్‌ లాంటి మ్యాచ్ భవిష్యత్‌లో జరుగుతుందని చెప్పడానికి కూడా వీల్లేదు. కప్ గెలవకపోతే ప్రాణం పోతుందేమో, దేశం నుంచి వెలి వేస్తారేమో అన్నంతగా ఈ వీరులు టెన్నీస్ బాల్‌తో యుద్దం చేశారు.  ఎప్పటికప్పుడు ఆధిక్యం చేతులు మారుతూ.. అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగిన వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ తుది సమరంలో ఆఖరికి  జకోవిచ్‌నే విజయం వరించింది.

రికార్డు స్థాయిలో ఇంచుమించు 5 గంటలు వరకు సాగిన ఈ ఫైనల్ పోరులో ఫెదరర్‌ను ఓడించి జకోవిచ్‌ వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నొవాక్‌ కెరీర్‌లో ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌. మొత్తం మీద 16వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. ఫైనల్ పోరులో..  జకోవిచ్‌ 7-6 (7-5), 1-6, 7-6 (7-4), 4-6, 13-12 (7-3)తో ఫెదరర్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి జకోవిచ్, రోజర్‌ గొప్పగా పోరాడారు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్‌లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు. స్విస్‌ స్టార్‌ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)… రన్నరప్‌ ఫెడరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?