బిర్యానీ తింటే ఖబర్దార్… పాక్ క్రికెటర్లకు కోచ్ వార్నింగ్!

ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్‌ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్‌లు తింటూ డైట్‌ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్‌ మండిపడ్డారు. భారత్‌తో మ్యాచ్‌లో సర్పరాజ్‌ ఫీల్డ్‌లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌లో  పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పేలవ ప్రదర్శనకు ఆహార నియమావళిలో సరైన నియంత్రణ లేకపోవడమేననే వాదన వినిపించింది. పాక్‌ క్రికెట్‌ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం […]

బిర్యానీ తింటే ఖబర్దార్... పాక్ క్రికెటర్లకు కోచ్ వార్నింగ్!
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 5:26 PM

ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్‌ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్‌లు తింటూ డైట్‌ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్‌ మండిపడ్డారు. భారత్‌తో మ్యాచ్‌లో సర్పరాజ్‌ ఫీల్డ్‌లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌లో  పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పేలవ ప్రదర్శనకు ఆహార నియమావళిలో సరైన నియంత్రణ లేకపోవడమేననే వాదన వినిపించింది. పాక్‌ క్రికెట్‌ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడు.

ఈ క్రమంలో ప్రధాన కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇక నుంచి పాక్ ఆటగాళ్లు బిర్యానీ, స్పైసీ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలని మిస్బా ఆదేశాలు జారీచేశాడు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. కోచ్ నిర్ణయంతో పాక్ ఆటగాళ్లు అందరికి ఒక్కసారిగా షాక్ తగిలింది.

ఇటీవలే మికీ ఆర్థర్‌ను పాక్‌ ప్రధాన కోచ్‌ బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. మిస్బావుల్‌కు ఆ బాధ్యతలు అప‍్పగించింది. మరొకవైపు దేశవాళీ మ్యాచ్‌లకు కోచ్‌లుగా వ్యవహరించే వారికి చీఫ్‌ సెలక్టర్‌గా కూడా అతన్నే ఎంపిక చేసింది. దాంతో ఒకే సమయంలో మిస్బా రెండు కీలక బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. బాధ్యతలు చేపట్టిన మిస్బా మొదటి అడుగు బలంగానే వేసాడు.

పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో పూర్తి దృష్టి సారించిన మిస్బా.. కొత్త సంప్రదాయానికి తెరలేపాడు. ఇక నుంచి పాక్‌ క్రికెటర్లు బిర్యానీ, స్పైసీ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలనే నిబంధనను అమల్లోకి తెచ్చాడు. దీన్ని దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో కూడా అవలంభించాలని మిస్బా ఆదేశాలు జారీచేశాడని సమాచారం. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించాడు.

లంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం పీసీబీ సోమవారం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో పాక్ సీనియర్‌ ఆటగాళ్లు మహ్మద్‌ హఫీజ్‌, షోయాబ్‌ మాలిక్‌లను ఎంపిక చేయలేదు. దీంతో మిస్బా తన మార్క్ చూపించాడు. సర్ఫరాజ్‌ అహ్మద్‌ను మాత్రం కెప్టెన్‌గా కొనసాగించారు. ఇక బాబర్‌ అజమ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

నూతన కోచ్‌గా ఎంపికైన సమయంలో మిస్బా మాట్లాడుతూ జట్టును విజయపథంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడు. ‘మన వద్ద ఉండే అవకాశాలతోనే మన ఎత్తుగడలు ఉంటాయనే విషయాన్ని నమ్ముతాను. తద్వారా ప్రత్యర్థులను బలహీనపర్చి వారిని ఓడించే ప్రయత్నం చేయాలి. ఒక కోచ్‌గా అత్యుత్తమ జట్టుని తీర్చిదిద్దడానికి ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కృషి చేస్తా. అలానే పాక్‌ జట్టు తేలికగా మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నిస్తా. ఒక్కోసారి ప్రత్యర్థులు బలంగా ఉండొచ్చు. అప్పుడు వారి బలాబలాలపై కన్నేసి మన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది’ అని మిస్బా పేర్కొన్నాడు.

[svt-event date=”17/09/2019,4:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]