‘సూపర్’ ఫోబియా: వరుసగా 6 సార్లు సూపర్ ఓవర్‌లో ఓడిన న్యూజిలాండ్

భారత్‌తో జరిగిన గత రెండు టీ20 మ్యాచుల్లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్ శాపంగా మారింది. కివీస్ కు సూపర్ ఓవర్ ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ కివీస్ కు కలిసిరావడం లేదనే విషయం మరోసారి రుజువైంది. హమిల్టన్ వేదికగా గత బుధవారం(జనవరి 29,2020) జరిగిన మూడో టీ20లో భారత్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్.. శుక్రవారం(జనవరి 31,2020) వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ మరోసారి టీమిండియా చేతిలో […]

'సూపర్' ఫోబియా: వరుసగా 6 సార్లు సూపర్ ఓవర్‌లో ఓడిన న్యూజిలాండ్

భారత్‌తో జరిగిన గత రెండు టీ20 మ్యాచుల్లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్ శాపంగా మారింది. కివీస్ కు సూపర్ ఓవర్ ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ కివీస్ కు కలిసిరావడం లేదనే విషయం మరోసారి రుజువైంది. హమిల్టన్ వేదికగా గత బుధవారం(జనవరి 29,2020) జరిగిన మూడో టీ20లో భారత్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్.. శుక్రవారం(జనవరి 31,2020) వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ మరోసారి టీమిండియా చేతిలో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది.

2020లో భారత్ చేతిలో రెండు సార్లు సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. 2019లో రెండు సార్లు ఇంగ్లండ్ చేతిలో సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. 2012లో శ్రీలంక, విండీస్ చేతిలో సూపర్ ఓవర్లో ఓడింది. 2010లో మాత్రం ఆసీస్ పై గెలిచింది. 2008లో వెస్టిండీస్ చేతిలో సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. మొత్తంగా.. 2008 నుంచి 8 సార్లు సూపర్ ఓవర్‌లో ఆడిన న్యూజిలాండ్.. ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. 2010లో క్రైస్ట్‌ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఓవర్‌లో మాత్రమే కివీస్ గెలుపొందింది.

కివీస్ తరఫున బౌలర్ టిమ్ సౌతీ 6 సార్లు సూపర్ ఓవర్ వేశాడు. ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థిని అడ్డుకుని గెలిపించాడు. వరుసగా రెండు సూపర్ ఓవర్లలో న్యూజిలాండ్ ఓటమి చవిచూడడంతో సూపర్ ఓవర్ తమకు కలిసిరావడం లేదని కివీస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ సిరీస్ లో చివరి టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.

[svt-event date=”01/02/2020,4:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Click on your DTH Provider to Add TV9 Telugu