ఆ సంస్థ నన్ను మోసం చేసింది- ధోని

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి తనను మోసం చేసిందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమ్రపాలి సంస్థకు ప్రచారకర్తగా ఉన్న సమయంలో తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఓ ఇంటి విషయంలోనూ ఆ సంస్థ తనను మోసం చేసిందని ధోని తెలిపాడు. 2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా మార్చుకోవడంతోపాటు పలు వ్యాపార విషయాల్లో ఆమ్రపాలి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను […]

ఆ సంస్థ నన్ను మోసం చేసింది- ధోని
Ravi Kiran

|

Apr 28, 2019 | 11:53 AM

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి తనను మోసం చేసిందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమ్రపాలి సంస్థకు ప్రచారకర్తగా ఉన్న సమయంలో తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఓ ఇంటి విషయంలోనూ ఆ సంస్థ తనను మోసం చేసిందని ధోని తెలిపాడు. 2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా మార్చుకోవడంతోపాటు పలు వ్యాపార విషయాల్లో ఆమ్రపాలి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఆ సంస్థ ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని అమ్రపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ ధోనికి యాజమాన్య హక్కులు కల్పించలేదు.

మరోవైపు ఆమ్రపాలి సంస్థ గత కొద్దికాలంగా ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుంది. అంతేకాకుండా ఆ సంస్థపై సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఆమ్రపాలి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది సంస్థ తమను మోసం చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆ సంస్థకు చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.  కాగా మధ్యలో ఆపేసిన పనులు పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు సుప్రీం కోర్టు జనవరి 25న తెలిపింది. ఫిబ్రవరి 28న ఆ సంస్థకు చెందిన సీఎండీ అనిల్‌ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్‌ దీవాని, అజయ్‌ కుమార్‌ను పోలీస్‌ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu