షమీపై చార్జ్‌షీట్‌ నమోదు

కోల్‌కతా:ప్రపంచ కప్‌ దగ్గర్లో ఉన్న సమయంలో భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను వేధించాడన్న ఆరోపణల కేసులో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. అతని భార్య హసీన్‌ జహాన్‌ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు షమీపై గురువారం చార్జ్‌షీట్‌ నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ నేరాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోల్‌కతా మహిళా గ్రీవెన్ సెల్ పోలీసులు గురువారం అలీపోర్ ఏసీజేఎమ్ కోర్టులో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 498 ఏ […]

షమీపై చార్జ్‌షీట్‌ నమోదు
Follow us

|

Updated on: Mar 15, 2019 | 9:31 AM

కోల్‌కతా:ప్రపంచ కప్‌ దగ్గర్లో ఉన్న సమయంలో భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను వేధించాడన్న ఆరోపణల కేసులో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. అతని భార్య హసీన్‌ జహాన్‌ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు షమీపై గురువారం చార్జ్‌షీట్‌ నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ నేరాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోల్‌కతా మహిళా గ్రీవెన్ సెల్ పోలీసులు గురువారం అలీపోర్ ఏసీజేఎమ్ కోర్టులో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 498 ఏ (వరకట్న వేధింపులు), 354 ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు. షమీ సోదరుడు హసీబ్ అహ్మద్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే గతంలో నమోదు చేసిన 307 (హత్యాయత్నం), 376 (లైంగిక దోపిడికి శిక్ష) వంటి నేరపూరిత కఠినమైన సెక్షన్లను పోలీసులు ఉపసంహరించుకున్నారు.

దీంతో ఈ కేసులో షమీకి కాస్త ఊరట కలిగినైట్లెంది. అలాగే తల్లిదండ్రులు, మరదలి పేరును కూడా ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు. ఆరోపణల దృష్ట్యా ముందుగా షమీకి కాంట్రాక్ట్‌ నిరాకరించిన బీసీసీఐ…అనంతరం అతనికి క్లీన్ చిట్‌ ఇచ్చింది. తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను షమీ భార్య హసీన్ జహాన్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.‌