కేఎల్ రాహుల్‌కు షాక్…

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌ చేసి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా..వన్డే, టెస్ట్ సిరీస్‌లకు సన్నమద్దమవుతోంది. అయితే ఊహించని విధంగా భారత స్టార్ ఓపెనర్స్ రోహిత్, ధావన్ గాయాలతో టీమ్‌కు టెస్టులకు దూరమయ్యారు. డోపింగ్ టెస్టులో ఊహించిన విధంగా బుక్కయిన పృథ్వీ షా ..నిషేదం అనంతరం మళ్లీ సూపర్ ఫామ్‌తో జట్టులో స్థానం సంపాదించాడు. యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్​- ఏ తో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో డబుల్‌ సెంచరీతో రాణించి నాటౌట్‌గా […]

కేఎల్ రాహుల్‌కు షాక్...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌ చేసి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా..వన్డే, టెస్ట్ సిరీస్‌లకు సన్నమద్దమవుతోంది. అయితే ఊహించని విధంగా భారత స్టార్ ఓపెనర్స్ రోహిత్, ధావన్ గాయాలతో టీమ్‌కు టెస్టులకు దూరమయ్యారు. డోపింగ్ టెస్టులో ఊహించిన విధంగా బుక్కయిన పృథ్వీ షా ..నిషేదం అనంతరం మళ్లీ సూపర్ ఫామ్‌తో జట్టులో స్థానం సంపాదించాడు.

యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్​- ఏ తో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో డబుల్‌ సెంచరీతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. సేమ్ మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్ కెప్టెన్ హనుమ విహారి సెంచరీతో అజేయంగా నిలిచాడు. దీంతో వీరిద్దరూ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు నిరాశే మిగిలింది. రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు. కాగా ఇండియా కివీస్ మధ్య  ఫిబ్రవరి 21 నుంచి మొదటి టెస్టు ప్రారంభంకానుంది.

భారత తుది జట్టు :

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), అజింక్య రహానే (వైస్​ కెప్టెన్​),  వృద్ధిమాన్​ సాహా (కీపర్​), పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్​, చటేశ్వర్​ పుజారా, మయాంక్​ అగర్వాల్​,  హనుమ విహారీ,  రిషబ్​ పంత్​, రవిచంద్ర అశ్విన్​, రవీంద్ర జడేజా, నవదీప్​ సైనీ, ఇషాంత్​ శర్మ, జస్ప్రిత్​ బుమ్రా, ఉమేశ్​ యాదవ్​, మహ్మద్​ షమి.

Published On - 1:41 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu