ఫించ్ విలువైన ఆటగాడు: ఆసిస్ కోచ్

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ మళ్లీ తన మునుపటి ఫామ్‌ అందుకుంటాడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఫించ్‌ త్వరలోనే తిరిగి గాడిలో పడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అతనొక విధ్వంసకర ఆటగాడనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఫించ్‌ ఫామ్‌ లేడు. కానీ అతను ఎంతో విలువైన ఆటగాడు. ఫామ్‌లో లేని అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఫించ్‌ రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం […]

ఫించ్ విలువైన ఆటగాడు: ఆసిస్ కోచ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 7:39 PM

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ మళ్లీ తన మునుపటి ఫామ్‌ అందుకుంటాడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఫించ్‌ త్వరలోనే తిరిగి గాడిలో పడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అతనొక విధ్వంసకర ఆటగాడనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఫించ్‌ ఫామ్‌ లేడు. కానీ అతను ఎంతో విలువైన ఆటగాడు. ఫామ్‌లో లేని అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

ఒకసారి ఫించ్‌ రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం కష్టం. ఇక నాయకుడిగా కూడా ఫించ్‌ ఆకట్టుకుంటున్నాడు. జట్టులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు. అతనిది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం’ అని లాంగర్‌ కొనియాడాడు.ఇక రెండో టీ20లో శతకం సాధించి ఆసీస్‌ సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్‌పై కూడా లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు. తమకు మ్యాక్సీ చాలా కీలక ఆటగాడని,  ఇటీవల కాలంలో అతని ఆట తీరులో మరింత నిలకడ పెరగడం ఆసీస్‌ జట్టుకు శుభపరిణామమన్నాడు.