రెజ్లర్‌ జాన్ సీనాపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

వరల్డ్‌ రెజ్లింగ్‌ స్టార్‌ జాన్‌ సీనా.. విరాట్‌ కోహ్లీకి ఒకరికొకరు పరిచయం లేదు. కానీ సీనాకు కోహ్లీ అంటే ఎందుకో పడదు. గతంలోనూ ఓసారి కోహ్లీని కించపరిచేలా సోషల్‌ మీడియాలో ఫొటో పోస్ట్‌ చేసిన జాన్‌.. మళ్లీ అలాంటి పనే చేశాడు. తన ఎదురుగా కనిపించని వ్యక్తితో కోహ్లీ షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంటే.. కోహ్లీ ఎదురుగాలేని వ్యక్తి తానేనని, విరాట్‌తో తాను షేక్‌హ్యాండ్‌ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని భావించేలా ఆ […]

రెజ్లర్‌ జాన్ సీనాపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2019 | 12:10 AM

వరల్డ్‌ రెజ్లింగ్‌ స్టార్‌ జాన్‌ సీనా.. విరాట్‌ కోహ్లీకి ఒకరికొకరు పరిచయం లేదు. కానీ సీనాకు కోహ్లీ అంటే ఎందుకో పడదు. గతంలోనూ ఓసారి కోహ్లీని కించపరిచేలా సోషల్‌ మీడియాలో ఫొటో పోస్ట్‌ చేసిన జాన్‌.. మళ్లీ అలాంటి పనే చేశాడు. తన ఎదురుగా కనిపించని వ్యక్తితో కోహ్లీ షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంటే.. కోహ్లీ ఎదురుగాలేని వ్యక్తి తానేనని, విరాట్‌తో తాను షేక్‌హ్యాండ్‌ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని భావించేలా ఆ ఫొటోను అతడు పోస్ట్‌ చేసినట్టుంది. అయితే ఈ ఫొటో కోహ్లీ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. అమెరికాకు చెందిన రెజ్లర్‌ జాన్‌.. తమ దేశంలో క్రికెట్‌కు అంత క్రేజ్‌ లేదన్న విషయాన్ని చెబుతూ ఆ ఫొటో పెట్టి ఉంటాడని భావిస్తున్నారు.

https://www.instagram.com/p/BzoCSdcllFy/?utm_source=ig_web_copy_link