ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన జస్ప్రీత్ బుమ్రా!

టీ20ఐ సిరీస్‌ ఐదవ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును చెరిపేశాడు. ఈ మ్యాచులో […]

ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన జస్ప్రీత్ బుమ్రా!

టీ20ఐ సిరీస్‌ ఐదవ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును చెరిపేశాడు.

ఈ మ్యాచులో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Published On - 9:12 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu