భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్: జడేజా తలకు గాయం.. సిరీస్‌ నుండి ఔట్.. శార్దూల్ ఠాకూర్ ఇన్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు టీ20 సిరీస్ నుండి రవీంద్ర జడేజా దూరమయ్యాడు. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జడేజాకు..

  • Shiva Prajapati
  • Publish Date - 7:21 am, Sat, 5 December 20
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్: జడేజా తలకు గాయం.. సిరీస్‌ నుండి ఔట్.. శార్దూల్ ఠాకూర్ ఇన్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు టీ20 సిరీస్ నుండి రవీంద్ర జడేజా దూరమయ్యాడు. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జడేజాకు గాయమవడంతో సెలెక్టర్లు అతనికి రెస్ట్ ఇచ్చారు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పేసర్ స్టార్క్ విసిరిన రెండో బంతి జడేజా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే జడేజా అప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మ్యాచ్ ముగిశాక తల తిరిగినట్టుగా అనిపించడంతో అతను ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అయితే, జడేజాకు చికిత్స అందించామని బీసీసీఐ ప్రకటించింది. అవసరమైతే స్కానింగ్ చేయాల్సి ఉంటుందని, అప్పటి వరకు జడేజా అబ్జర్వేషన్‌లో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అలాగే జడేజా స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.