ఇండియన్‌ సూపర్‌ లీగ్ 2020-21: హైదరాబాద్‌కు తృటిలో చేజారిన విజయం, జంషెడ్ పూర్‌తో మ్యాచ్ డ్రా

సూపర్ విక్టరీతో  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్ఎల్‌) ఏడో సీజన్‌ను స్టార్ట్ చేసిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ మరో విజయాన్ని జస్ట్ మిస్సయ్యింది. చివర్లో కంగారుపడి...

ఇండియన్‌ సూపర్‌ లీగ్ 2020-21: హైదరాబాద్‌కు తృటిలో చేజారిన విజయం, జంషెడ్ పూర్‌తో మ్యాచ్ డ్రా
Ram Naramaneni

|

Dec 03, 2020 | 1:54 PM

సూపర్ విక్టరీతో  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్ఎల్‌) ఏడో సీజన్‌ను స్టార్ట్ చేసిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ మరో విజయాన్ని జస్ట్ మిస్సయ్యింది. చివర్లో కంగారుపడి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డ్రాతో సర్దుకుపోవాల్సి వచ్చింది. బుధవారం  తిలక్ మైదాన్ గ్రౌండ్‌లో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన పోరులో ఇరు జట్లు నువ్వా-నేనా అంటూ పందెం కోళ్లలా పోటీ పడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరు 1-1తో డ్రా ముగిసింది.

హైదరాబాద్ తరఫున అరిడానే శాంటానా 50వ నిమిషంలో గోల్ చేశాడు. జంషెడ్‌పూర్ ఆటగాడు స్టీఫెన్‌యిజే 85వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టను పరాజయం నుంచి తప్పించాడు. తొలుత ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే బ్రేక్ అయిపోగానే పవన్ కుమార్ నుంచి పాస్ అందుకున్న శాంటానా మెరుపు వేగంతో కదిలి బాల్‌ను నేరుగా నెట్‌లోకి పంపి హైదరాబాద్‌ను 1-0తో ఆధిపత్యంలో నిలిపాడు. కాసేపటికే లీడ్‌ను డబుల్ చేసే మంచి అవకాశాన్ని ఆశీష్ రాయ్ వేస్ట్ చేశాడు.  ఈ సమయంలో జంషెడ్‌పూర్ గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, ఆ జట్టు ఆటగాళ్లను హైదరాబాద్ డిఫెండర్లు స్ట్రాంగ్‌గా నిలువరించారు. 71 నిమిషంలో ఆ టీమ్ గోల్ కొట్టినప్పటికీ ఫౌల్ కావడంతో రెఫరీ దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో హైదరాబాద్ గెలుపు దిశగా పయనించింది. 80 వ నిమిషంలో గాయంతో శాంటానా గ్రౌండ్ వీడటంతో హైదరాబాద్ కాస్త డల్ అయ్యింది. కాసేపటికే ఇన్‌సైడ్ బాక్స్ నుంచి యిజే చేసిన గోల్‌తో జంషెడ్‌పూర్ ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు ఫుట్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది.

Also Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu