చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు రాయుడు చురకలు

ముంబై: ఐసీసీ ప్రపంచకప్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీం ఇండియా ఈ ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. బీసీసీఐ సోమవారం ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే ఎంతోకాలంగా టీంలో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. 4వ స్థానంలో ఎవరిని తీసుకోవాలని, ఆ స్థానంలో పదిలంగా ఎవరు బ్యాటింగ్ చేయగలరనే విషయంపై సెలక్టర్లు […]

చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు రాయుడు చురకలు
Follow us

|

Updated on: Apr 17, 2019 | 10:07 AM

ముంబై: ఐసీసీ ప్రపంచకప్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీం ఇండియా ఈ ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. బీసీసీఐ సోమవారం ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే ఎంతోకాలంగా టీంలో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. 4వ స్థానంలో ఎవరిని తీసుకోవాలని, ఆ స్థానంలో పదిలంగా ఎవరు బ్యాటింగ్ చేయగలరనే విషయంపై సెలక్టర్లు తలలు బాదుకున్నారు. అయితే అంబటి రాయుడుని నెం.4 కోసం జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. రాయుడు కూడా ఇందుకోసం ఎంతో శ్రమించాడు. అయితే రాయుడుని పక్కన పెట్టి అనూహ్యంగా విజయ్ శంకర్‌కి జట్టులో చోటు కల్పించారు. దీంతో అంబటి రాయుడు కాస్త నిరాశకి గురయ్యాడు.

జట్టు ఫైనల్ కూర్పుపై రాయుడు కాస్త వ్యగ్యంగా కౌంటరిచ్చాడు.  ‘ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లజోళ్లు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాను’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. టీమిండియా తరఫున మంచి సగటు కలిగి ఉన్న ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. దీనిపై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇస్తూ.. విజయ్‌శంకర్‌ త్రీడైమెన్షన్‌లో సేవలు అందిస్తాడని అందుకే విజయ్‌ను ఎంపిక చేశామని అన్నాడు. దానికి బదులుగా స్పందించిన రాయుడు ఈసారి ప్రపంచకప్‌ను త్రీడీ కళ్లద్దాలతో చూస్తానంటూ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రం విసిరాడు. ఈ పోస్ట్‌పై కొందరేమో  వెటకారం తెలుగువాళ్లకు సొంతమని మరోసారి నిరూపించారని ఛలోక్తులు విసురుతున్నారు. మరికొంతమందేమో.. మే 23 వరకూ అవకాశం ఉంది. ఐపీఎల్‌లో వచ్చే మ్యాచుల్లో వరస శతకాలు బాదితే చోటు ఎలా దక్కదో చూద్దాం.. అంటూ రాయుడులో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు.