భారత త్రయం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది… పార్ట్ టైం బౌలర్లు అవసరమన్న భారత మాజీ ఆటగాడు…

ఆసీస్ సిరీస్ లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంపై ,ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. నిన్న గౌతమ్ గంభీర్ కెప్టెన్ కొహ్లీ నిర్ణయాలను తప్పుపట్టగా... తాజాగా మరో భారత మాజీ ఆటగాడుసుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌ స్పందించాడు.

భారత త్రయం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది... పార్ట్ టైం బౌలర్లు అవసరమన్న భారత మాజీ ఆటగాడు...

Indian team missing legendary cricketer’s ఆసీస్ సిరీస్ లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంపై క్రికెట్ అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. నిన్న గౌతమ్ గంభీర్ కెప్టెన్ కొహ్లీ నిర్ణయాలను తప్పుపట్టగా… తాజాగా మరో భారత మాజీ ఆటగాడుసుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌ స్పందించాడు. భారత్‌ టాప్‌ ఆర్డర్‌లో త్రయం… వీరేంద్ర సెహ్వాగ్‌, సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండుల్కర్‌ వంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆసీస్‌ సిరీస్లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోందని అన్నారు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇస్తున్నారని తెలిపారు.

భారతమంతా బౌలర్ల మీదే…

భారత త్రయం బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్‌ కూడా చేశారని గుర్తు చేశారు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్‌ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఆసీస్ సిరీస్ లో భారమంతా బౌలర్ల మీదే పడుతోందని అన్నారు. బౌలర్లు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరని తెలిపారు. ధావన్‌, అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యార్‌, కేఎల్‌ రాహుల్‌, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్‌ చేయలేరు. గతంలో రోహిత్‌ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. అయితే రోహిత్ ఇప్పుడు అందుబాటులో లేరని తెలిపారు. ఆల్‌రౌండర్‌ హర్థిక్‌ పాండ్యా సైతం బౌలింగ్‌ చేసే పరిస్థితిలో లేడని… ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయపడ్డాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu