పొట్టి సిరీస్ మనం కొడితే..గట్టి సిరీస్ వాళ్లు ఎగరేసుకుపోయారు

రెండో వన్డేలనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ రాణించడంతో 22 పరుగులతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. 2014 అనంతరం ఇండియాపై కివీస్‌కు ఇదే  తొలి సిరీస్‌ విజయం. జడేజా (55), శ్రేయస్‌ అయ్యర్‌ (52),  నవదీప్‌ సైని (45) జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికి..టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈడెన్ పార్క్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:38 pm, Sat, 8 February 20
పొట్టి సిరీస్ మనం కొడితే..గట్టి సిరీస్ వాళ్లు ఎగరేసుకుపోయారు

రెండో వన్డేలనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ రాణించడంతో 22 పరుగులతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. 2014 అనంతరం ఇండియాపై కివీస్‌కు ఇదే  తొలి సిరీస్‌ విజయం. జడేజా (55), శ్రేయస్‌ అయ్యర్‌ (52),  నవదీప్‌ సైని (45) జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికి..టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఈడెన్ పార్క్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. అద్బుత ఫామ్‌లో ఉన్న రాస్‌ టేలర్‌, ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ అర్థ సెంచరీలు చేయడంతో.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి.. 273 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 274 పరుగులు యావరేజ్ టార్గెట్ మాత్రమే ఉంది. మిడిల్ ఓవర్లలో పొదపుగా బౌలింగ్ చేసిన ఇండియన్ బౌలర్స్ ఇన్నింగ్స్ చివర్లో మాత్రం కంగారుపడి ఎక్కువ పరుగులు ఇచ్చారు.  యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకూర్‌ 2, వికెట్లు తీశాడు.

టాస్ ఓడటంతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన కివీస్‌కు మార్టిన్ గుప్టిల్, హెర్నీ నికోలస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం చెత్త బంతుల్నే బౌండరీలకు తరలిస్తూ.. మొదటి వికెట్‌కి 93 పరుగులు జోడించారు. స్థిరంగా కొనసాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌కు చాహల్  17వ ఓవర్‌‌లో బ్రేక్ వేశాడు. ఐదో బంతికి హెర్నీ నికోలస్ (41) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తదుపరి ఓవర్‌లోనే గప్తిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ 27వ ఓవర్‌ బ్లండెల్‌ (22)‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక జడ్డూ వేసిన 30వ ఓవర్‌లో ప్రమాదకర మార్టిన్‌ గప్తిల్‌ (79) రనౌటయ్యాడు. ఇక్కడ్నుంచి రెచ్చిపోయిన ఠాకూర్‌, చాహల్..వరసబెట్టి కివీస్ టాప్ ఆర్డర్‌ను వెనక్కి పంపారు. కెప్టెన్ టామ్ లాథమ్‌ (7) సహా, జిమ్మీ నీషమ్‌ (3),  గ్రాండ్‌హోమ్‌ (5), మార్క్ చాప్మన్ (1)లు స్వల్ప పరుగులకే ఔటయ్యారు. ఈ సమయంలో తీవ్ర కష్టాల్లో ఉన్న తమ జట్టును సీనియర్ బాట్స్‌మెన్ రాస్‌ టేలర్‌ ఆదుకున్నాడు. 73 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. కొత్త కుర్రాడు కైల్ జేమీసన్‌ (25) రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది.