ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల… టెస్టుల్లో భారత్ నెంబర్ 1

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 123 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవడం విశేషం. కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసం కారణంగా భారత్ (121) రెండో ర్యాంక్‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీమిండియా తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (115), న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109), […]

ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల... టెస్టుల్లో భారత్ నెంబర్ 1
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 10:08 AM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 123 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవడం విశేషం. కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసం కారణంగా భారత్ (121) రెండో ర్యాంక్‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీమిండియా తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (115), న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109), పాకిస్థాన్ (96), బంగ్లాదేశ్ (86), వెస్టిండీస్ (80), శ్రీలంక (76), అఫ్గానిస్థాన్ (64) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

టెస్టు ర్యాంకింగ్స్… గత ఏడాది కాలంగా విదేశాల్లో సైతం ఘన విజయాల్ని అందుకున్న భారత్ జట్టు 113 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ (111) రెండో స్థానానికి పరిమితమైంది. ఇక మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (108) ఆ తర్వాత ఇంగ్లాండ్ (105), ఆస్ట్రేలియా (98), శ్రీలంక (94), పాకిస్థాన్ (84), వెస్టిండీస్ (82), బంగ్లాదేశ్ (65), జింబాబ్వే (16) టాప్-10లో నిలిచాయి.