Pakistan vs India: పాకిస్తాన్ క్రికెటర్లకు గూడ్ న్యూస్ చెప్పిన భారత ప్రభుత్వం.. అభిమానులకు పండగే పండుగ..

Pakistan vs India: దయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన క్రికెర్లకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు వీసాలు మంజూరు..

Pakistan vs India: పాకిస్తాన్ క్రికెటర్లకు గూడ్ న్యూస్ చెప్పిన భారత ప్రభుత్వం.. అభిమానులకు పండగే పండుగ..
India Vs Pakistan
Follow us

|

Updated on: Apr 17, 2021 | 5:11 PM

Pakistan vs India: దయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన క్రికెర్లకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు వీసాలు మంజూరు చేసేందుకు భారత ప్రభుత్వం ఓకే చెప్పింది. అక్టోబర్‌లో జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పాక్ ప్లేయర్లకు వీసా మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసా మంజూరు చేయడంపై ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా.. అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేశారు.

‘పాకిస్తాన్ క్రికెట్ జట్టు వీసా సమస్య పరిష్కరించడం జరిగింది. అయితే, అక్కడి అభిమానులు మ్యాచ్‌లను చూడటానికి వస్తారా? లేదా? అనేది మాత్రం సందేహమే’ అని అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు చెప్పారు. ‘నిర్ణీత సమయంతో వారికి వీసా మంజూరు చేయడం జరుగుతుందని, అవసరమైతే క్రమబద్ధీకరిస్తాం(రెన్యూవల్) అని ఐసిసికి హామీ ఇచ్చాం’ అని అపెక్స్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

ఇరు దేశాల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతల కారణంగా భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్లు చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. కాగా, టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ భారత్ వేదికగా జరగనుంది. ఈ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌‌కు అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. మిగతా మ్యాచ్‌లకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల స్టేడియంలు వేదికగా అవనున్నాయి.

Also read:

Tcl New Smart Phone: సరికొత్త ఫీచర్‌తో టీసీఎల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ రెండు ఆప్షన్స్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే..

COVID-19 lockdown: ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఏమన్నారో తెలుసా..?