భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కళింగ స్టేడియంలో వేల్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. కాగా మ్యాచ్ ఆరంభంలో భారత్, వేల్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో మొదటి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్లోని ఏడో నిమిషంలో (22వ నిమిషంలో) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌ను షంషేర్ సింగ్ రీబౌండ్ చేసి గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 32వ నిమిషంలో ఆకాశ్‌దీప్ రెండో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే 42, 44వ నిమిషంలో వేల్స్ రెండు వరుస గోల్స్ కొట్టి భారత జట్టుకు షాకిచ్చింది. ఇరు జట్ల స్కోర్లు డ్రా అయ్యాయి. అయితే చివరి క్వార్టర్ తొలి నిమిషంలో ఆకాశ్‌దీప్ (46వ నిమిషం) మరోసారి గోల్ చేయడంతో భారత్ 3-2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్ చివరి సెకన్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేయడంతో టీమిండియా 4-2 తేడాతో విజయం సాధించింది.
వరల్డ్‌కప్‌లో భాగంగా గత వారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగించింది. తాజాగా వేల్స్‌పై విజయంతో గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) అగ్రస్థానంలో ఉండి నేరుగా క్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ (ఆదివారం) ఆడి గెలవాల్సి ఉంటుంది. అప్పుడే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
Goal! Harmanpreet uses the penalty corner to its advantage and takes India to a comfortable score.
🇮🇳 IND 4-2 WAL 🏴#INDvsWAL #HockeyIndia #IndiaKaGame #HWC2023 #HockeyWorldCup2023 #StarsBecomeLegends @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI @HockeyWales
— Hockey India (@TheHockeyIndia) January 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..