ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. మొదటి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే.. పృథ్వీ షాకు ఉద్వాసన..

Ind Vs Eng: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో తలబడబోతోంది. భారత్‌లో జరగనున్న...

  • Ravi Kiran
  • Publish Date - 7:04 pm, Tue, 19 January 21
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. మొదటి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే.. పృథ్వీ షాకు ఉద్వాసన..

Ind Vs Eng: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో తలబడబోతోంది. భారత్‌లో జరగనున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా మొదలు కానుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ తొలి రెండు టెస్టులకు తుది జట్టును ఖరారు చేసింది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తిరిగి జట్టులోకి రాగా.. ఆసీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన పృథ్వీ షాకు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. ఆసీస్ పర్యటనలో శుభారంభాన్ని అందించిన రోహిత్ శర్మ, గిల్‌ ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.

భారత్ జట్టు(తొలి రెండు టెస్టులకు): రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేస్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహనే, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్