ప్రపంచ కప్ జట్టులోకి చిచ్చర పిడుగులు !

సిడ్నీ: ప్రపంచ కప్‌కు  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫైనలయ్యింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా  సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌,  ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఈ ఇద్దరూ గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్‌ నుంచి నిషేధానికి గురయ్యారు. ఇటీవల ఆ నిషేధం ముగియడంతో ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో రాణించి ఇంకా […]

ప్రపంచ కప్ జట్టులోకి చిచ్చర పిడుగులు !
Follow us

|

Updated on: Apr 15, 2019 | 11:24 AM

సిడ్నీ: ప్రపంచ కప్‌కు  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫైనలయ్యింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా  సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌,  ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఈ ఇద్దరూ గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్‌ నుంచి నిషేధానికి గురయ్యారు. ఇటీవల ఆ నిషేధం ముగియడంతో ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో రాణించి ఇంకా ఫామ్‌లోనే ఉన్నామని నిరూపించడంతో…  ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు వాళ్లకు అవకాశం ఇచ్చింది.   అయితే వార్నర్‌, స్మిత్‌ జట్టులో చేరనుండటంతో బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, ఫాస్ట్‌ బౌలర్‌ హెజిల్‌వుడ్‌కు మొండి చేయి తప్పలేదు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన ఉస్మాన్‌ ఖవాజాతో పాటు షాన్‌ మార్ష్‌కు చోటు దక్కింది. ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 1న అఫ్గనిస్థాన్‌తో తలపడనుంది.

వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), బెహ్రెండార్ఫ్‌,  డేవిడ్ వార్నర్, స్టీవెన్‌ స్మిత్‌, కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, అలెక్స్‌ కేరీ(వికెట్‌ కీపర్‌), ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ లైయన్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, స్టార్క్‌, స్టొయినీస్‌, రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా