రామ మందిర ద‌ర్శ‌నానికి భార‌త్ వ‌స్తాః పాకిస్తాన్ క్రికెట‌ర్‌

రామ మందిర ద‌ర్శ‌నానికి భార‌త్ వ‌స్తాః పాకిస్తాన్ క్రికెట‌ర్‌

రామ మందిర ద‌ర్శ‌నానికి భార‌త్‌కి వ‌స్తాన‌ని పేర్కొన్నారు పాకిస్తాన్ క్రికెట‌ర్ డానిష్ కనేరియా. గ‌త కొద్ది రోజుల ముందు అయోధ్య రామ మందిర‌ నిర్మాణానికి జ‌రిగిన భూమి పూజ‌పై స్పందించాడు. మ‌ళ్లీ ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి మాట్లాడుతూ.. భూమి పూజ స‌మ‌యంలో అయోధ్య‌లో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 10:26 PM

రామ మందిర ద‌ర్శ‌నానికి భార‌త్‌కి వ‌స్తాన‌ని పేర్కొన్నారు పాకిస్తాన్ క్రికెట‌ర్ డానిష్ కనేరియా. గ‌త కొద్ది రోజుల ముందు అయోధ్య రామ మందిర‌ నిర్మాణానికి జ‌రిగిన భూమి పూజ‌పై స్పందించాడు. మ‌ళ్లీ ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి మాట్లాడుతూ.. భూమి పూజ స‌మ‌యంలో అయోధ్య‌లో ఇది ఒక ఆశిర్వాద దినం. ఈ రోజు ప్ర‌తీ భార‌తీయుడి జ్ఞాప‌కార్థంగా ఉంటుంది. రాముడి అందం అత‌ని పేరులో కాకుండా అత‌ని పాత్ర‌లో ఉంది. ఆయ‌న చెడుపై మంచి సాధించిన విజ‌యానికి చిహ్నం అని చెప్పాడు. అయితే రామ మందిర భూమి పూజ‌పై అత‌ను స్పందించ‌డంతో కొంత‌మంది అత‌నిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌నేరియా మాట్లాడుతూ.. హిందువుగా రాముడిని నేను ఆరాధిస్తాను. చిన్న‌ప్ప‌టి నుంచే ఆ దేవుడు అంటే నాకు ఇష్టం. ఆయ‌న జీవన విధానం నాకు ఆద‌ర్శం. అయితే రామ మందిరంపై నేను చేసిన ట్వీట్ ఎవ‌రి మ‌నోభావాల్ని దెబ్బ తీయాల‌ని కాదు. ఒక‌వేళ రాముడు క‌నిక‌రిస్తే.. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు త‌ప్ప‌కుండా భార‌త్‌కు వెళ్తానని క‌నేరియా తెలిపాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు పాక్ త‌ర‌పున క్రికెట్ ఆడిన హిందువులు కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే. అందులో డానిష్ క‌నేరియా ఒక‌డు.

Read More:

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu