Happy Birthday Rahul Dravid: ది వాల్ కు సరిలేరు ఎవ్వరూ.. లెజెండరీ క్రికెటర్ ద్రావిడ్ పుట్టిన రోజు నేడు

భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓపేజీని సువర్ణాక్షరాలతో పేరు లిఖించుకున్న వ్యక్తి రాహుల్ ద్రావిడ్. ముద్దుగా దివాల్ అని పిలుచుకునే ఈ లెజెండరీ క్రికెటర్ ద్రావిడ్ పుట్టిన రోజు నేడు. ఈ రోజు తన..

Happy Birthday Rahul Dravid: ది వాల్ కు సరిలేరు ఎవ్వరూ..  లెజెండరీ క్రికెటర్ ద్రావిడ్ పుట్టిన రోజు నేడు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 12:57 PM

Happy Birthday Rahul Dravid: భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓపేజీని సువర్ణాక్షరాలతో పేరు లిఖించుకున్న వ్యక్తి రాహుల్ ద్రావిడ్. ముద్దుగా దివాల్ అని పిలుచుకునే ఈ లెజెండరీ క్రికెటర్ ద్రావిడ్ పుట్టిన రోజు నేడు. ఈ రోజు తన 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఒకటిన్నర దశాబ్దాలకు పైగా ఇండియన్ క్రికెట్‌కు సేవలు అందించాడు. ఎన్నో రికార్డ్ లతో పాటు అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1973 జనవరి 11న రాహుల్ ద్రావిడ్ జన్మించాడు. మరాఠి కుటుంబంలో జన్మించిన ఆయన.. బెంటగళూరులో పెరిగాడు. అక్కడే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. 1991 లో రంజీ ట్రోఫిలో రాహుల్ ఆరంగేట్రం చేశాడు.. 1996 డబుల్ సెంచరీ సాధించి అందిరిని ఆకట్టుకున్నాడు.

1996లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాడ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అత్యధికంగా 100పైగా భాగస్వామ్యాలను నెలకొల్పి ద్రవిడ్ 70 సార్లు 100 పరుగులకు పైగా పాట్నర్‌షిప్‌లను సాధించాడు. చాలా మ్యాచ్‌లో ద్రావిడ్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన సందర్బాలు ఉన్నాయి. తన కేరీర్‌లో 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలపై డబుల్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఐదు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడుగా రాహుల్ ద్రావిడ్ రికార్డ్ నెలకొల్పాడు.1997లో తొలి టెస్ట్ సెంచరీ దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బెర్గ్‌లో సాధించాడు. 1999లో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్ లో న్యూజీలాండ్‌పై ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీ సాధించాడు. 2001 వివిఎస్ లక్ష్మణ్ తో కలిసి ఆస్ట్రేలియాపై ఐదవ వికెట్టుకు 376 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశాడు. 2008లో టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని అధికమించాడు.2009లో అలాన్ బోర్డర్ రికార్డును వెనక్కి నెట్టి టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

1996 ఏప్రిల్ 3న శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. వన్డే క్రికెట్‌లో 344 మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 10,889 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ద్రావిడ్ తన కేరీర్‌లో టీమిండియా టెస్ట్, వన్డే క్రికెట్‌కు కెప్టెన్‌గా పగ్గాలు వ్యవహరించాడు.. క్రికెటర్ గా అనేక విధాలుగా సేవలందించిన రాహుల్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అనంతరం ఐపీఎల్‌లో రాహుల్ సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 89 మ్యాచ్‌లు ఆడాడు. భారతీయ జూనియర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి ఎన్నో విజయాలను అందించాడు.

తన కెరీర్ లో ఎన్నో అవార్డులను రికార్డులను నెలకొల్పాడు రాహుల్ ద్రావిడ్. 2000 సంత్సరంలో ప్రపంచంలోనే బెస్ట్ ఫైవ్ క్రికెటర్స్‌లో ఒకడిగా నిలిచాడు. 2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.అదే ఏడాది భారత్ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. 2006లో ఐసీసీ టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2018లో ద్రావిడ్‌కు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటుదక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో భారత క్రికెటర్‌గా ద్రావిడ్ నిలిచాడు. అంతేగాదు ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయుడుగా చరిత్ర నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 300పైగా భాగస్వామ్యాలను రెండు సార్లు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మమెన్‌గా నిలిచాడు. ఈ రికార్డ్‌తో పాటు వరుసగా120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డ్ కూడా రాహుల్ ద్రావిడ్ సొంతం.

Also Read: అన్నతో కలిసి క్రిస్మస్ ట్రీ వద్ద వద్ద సందడి చేస్తున్న మహేష్ బాబు ముద్దుల తనయ సితార