ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో ఆర్థిక సంబంధాలు లేవు- సచిన్

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు మాజీ టీం ఇండియా ఆటగాడు సచిన్ టెండుల్కర్. బీసీసీఐ కమిటీలో ఉంటూ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని తనపై వస్తున్న ఆరోపణల్ని క్రికెట్ దిగ్గజం ఖండించాడు. ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందడం లేదని లేఖలో పేర్కొన్నాడు. ఆ జట్టులో నిర్ణయాత్మక పాత్ర పోషించడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. దీనిపై బీసీసీఐ అంబుడ్స్‌మెన్ డీకేజైన్‌కు 14 పేజీల లేఖ రాశాడు. […]

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో  ఆర్థిక సంబంధాలు లేవు- సచిన్
Follow us

|

Updated on: Apr 29, 2019 | 10:24 AM

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు మాజీ టీం ఇండియా ఆటగాడు సచిన్ టెండుల్కర్. బీసీసీఐ కమిటీలో ఉంటూ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని తనపై వస్తున్న ఆరోపణల్ని క్రికెట్ దిగ్గజం ఖండించాడు. ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందడం లేదని లేఖలో పేర్కొన్నాడు. ఆ జట్టులో నిర్ణయాత్మక పాత్ర పోషించడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. దీనిపై బీసీసీఐ అంబుడ్స్‌మెన్ డీకేజైన్‌కు 14 పేజీల లేఖ రాశాడు. క్రికెట్ సలహా మండలిలో సభ్యులుగా ఉన్న సచిన్, లక్ష్మణ్, గంగూలీ.. ఐపీఎల్‌లోని జట్లకు సేవలందిస్తూ ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందుతున్నారని సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సంజీవ్ గుప్తా పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వీరికి నోటీసులు అందించింది. వీటిపై స్పందిస్తూ సచిన్ బీసీసీఐకు లేఖ రాశారు.

బీసీసీఐ తనను 2015లో క్రికెట్ సలహా సభ్యుడిగా చేర్చిందన్నారు. అయితే అంతకుముందు నుంచే తాను ముంబై ఇండియన్స్‌కు సేవలందిస్తున్నానని తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై లక్ష్మణ్ కూడా స్పందించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు సేవలందించేందుకుగాను సీఏసీ సభ్యుడిగా వైదొలిగేందుకు అంగీకరించారు. భారత్ జట్టుకు కోచ్ నియామకంతో పాటు… మరికొన్ని అంశాల్లో సలహాలు తీసుకునేందుకు గానూ సచిన్ గంగూలీ, లక్ష్మణ్‌లతో సలహా కమిటీ సీఏసీని బీసీసీఐ నియమించింది.