Union Ex-Minister Dead: కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మొరార్కా మరణించారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు.  ఆయన మరణం తీరని లోటని.. రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి రాజ్‌కుమార్ శర్మ అన్నారు.  సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

  • Surya Kala
  • Publish Date - 11:55 am, Sat, 16 January 21
Union Ex-Minister Dead: కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు

Union Ex-Minister Dead: ముంబై లో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మొరార్కా మరణించారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు.  ఆయన మరణం తీరని లోటని.. రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి రాజ్‌కుమార్ శర్మ అన్నారు.  సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కమల్ మొరార్కా 1946 జూన్ 18వతేదీన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. పారిశ్రామికవేత్తగా మోరార్కా ఆర్గానిక్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన 1990-91లో చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.. 1988-94 మధ్య కాలంలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నియ్యారు కమల్ మోరార్కా.. ఇక, 2012 నుంచి సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ)కి నాయకత్వం వహించారు.

కమల్ క్రీడలపై మక్కువతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సామాజిక సేవ కార్యకర్తగా ఎన్నో సేవలందించారు. సేంద్రీయ వ్యవసాయానికి తోడ్పడ్డారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. వన్యప్రాణుల ఛాయాచిత్రాల పుస్తకాన్ని కూడా ప్రచురించారు. కమల్ మొరార్కా మృతి.. తీరని లోటుగా రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి రాజ్‌కుమార్ శర్మ, నవల్‌గఢ్‌ శాసన సభ్యుడు రాజ్‌కుమార్‌ శర్మ సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 96.56 శాతానికి పెరిగిన రికవరీ రేటు